Homeఎంటర్టైన్మెంట్Ilayaraja New Song: ఆకాశ తరంగాలను తాకబోతున్న ఇళయరాజా కొత్త పాట !

Ilayaraja New Song: ఆకాశ తరంగాలను తాకబోతున్న ఇళయరాజా కొత్త పాట !

Ilayaraja New Song: మాస్ట్రో ఇళయరాజా.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆయన ఓ లెజెండ్. సౌత్ సినీ సంగీత ప్రపంచంలో తిరుగులేని స్టార్ ఆయన. నేటికీ మేటిగా ఆయన ముద్ర చూపిస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు ఆయన ఖాతాలో మరో ఘనత కూడా చేరబోతోంది. ఇక నుంచి ఇళయరాజా సంగీతం అంతరిక్షంలోనూ మారుమోగనుంది. తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థుల బృందం అత్యంత చిన్న శాటిలైట్‌ తయారు చేసి ఈ ప్రయోగం చేస్తున్నారు.

Ilayaraja New Song
Ilayaraja New Song

Also Read: వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు – అనసూయ

భారతదేశ 75వ స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు 15న నాసా సహకారంతో అంతరిక్షంలోకి ఈ అత్యంత చిన్న శాటిలైట్‌ ను పంపనున్నారు. అయితే, ఈ అత్యంత చిన్న శాటిలైట్‌ విశేషమేమిటంటే.. ఈ శాటిలైట్‌ లో మనదేశం గొప్పతనాన్ని తెలియజేస్తూ గీత రచయిత స్వనంద్‌ కిర్కిరే రాసిన హిందీ పాట ప్లే అవుతుంది. కాగా ఈ పాటకు ఇళయరాజా బాణీలు కట్టబోతున్నారు. పైగా పాట తమిళ వెర్షన్‌ ను ఆలపించడానికి కూడా ఇళయరాజా రెడీ అవుతున్నారు.

మొత్తమ్మీద ఇళయరాజా సంగీతం ఆకాశ తరంగాలను తాకబోతుంది. ఇక ఇళయరాజా గీతాలకు ఎలా స్వరకల్పన చేశారో తెలుసా ? ముందుగా ఆయన ఏ బాషా పాటను అయినా తమిళంలో రాసుకుంటారు. నిజానికి ఇళయరాజా గారికి తెలుగు బాగా తెలుసు. ఒకవేళ అర్థంకాని మాండలిక పదాలు ఉంటే తెలుసుకుంటారు. పాటలోని పదాలు అర్థాలు అర్ధం చేసుకున్న తర్వాత, ఆ పాటకు బాణీ కడతారు. ఇలా అన్నీ పాటలకు పకడ్బందీగా సంగీతం సమకూరుస్తారు.

Also Read: వినుకొండలో ఘనంగా ‘అఖండ’ వేడుకలు !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

3 COMMENTS

  1. […] Puri Jagannath: ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా అద్భుతమే, కొత్త జనరేషన్ కు ఆ మాటలే గొప్ప పాఠాలు. అందుకే ‘పూరీ మ్యూజింగ్స్’కి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలను ముఖ్యంగా ప్ర‌పంచంలోని వింత‌లను, విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెప్పుకొస్తోన్న ఈ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాడు. టాపిక్ పేరు ‘హాలీవుడ్’. […]

Comments are closed.

Exit mobile version