
తమిళ హీరో విష్ణు విశాల్ ను ప్రేమించి చాలా సంవత్సరాలు డేటింగ్ గట్రా చేసి.. మొత్తానికి అతన్ని పెళ్లి చేసుకుంది బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. పెళ్లి చేసుకున్న దగ్గర నుండి ఇద్దరి మధ్య చిన్న అభిప్రాయబేధాలు వచ్చాయని, ఆ బేధాలు పెద్ద మనస్పర్థ వరకూ వెళ్ళిందనేది హాట్ టాపిక్ అయింది.
దాంతో జ్వాల పై విష్ణు విశాల్ తన కసి తీర్చుకోవడానికి ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు అని ఇలా రకరకాల పుకార్లు పుట్టించారు గాసిప్ రాయుళ్లు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ఏ మాత్రం నిజం లేదనేది తాజాగా వినిపిస్తున్న అప్ డేట్.
అయినా దాదాపు మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరి మధ్య ఎంతో అవగాహన ఉందట. తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టక ముందు నుంచే చాలా కాలంగా మేము ప్రేమలో ఉన్నామని, ఒకరిని ఒకరం ఎంతో బాగా అర్థం చేసుకున్నామని.. అప్పుడే మేము ఇక ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నామని.. మా పెళ్లి అయ్యాక గతంలో కంటే మేము ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నామని జ్వాలా చెప్పుకొచ్చింది.
ఇక హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌజ్ లో విష్ణు విశాల్, గుత్తా జ్వాల కేవలం 20-30 మంది అతిథుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అన్నట్టు గుత్తా జ్వాలకు ఇది వరకే పెళ్లయింది. బ్యాడ్మింటన్ స్టార్ చేతన్ ఆనంద్ ను వివాహం చేసుకుంది. కానీ ఇద్దరికీ పొసగలేదు. 2011లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె విష్ణు విశాల్ కు కనెక్ట్ అయింది.