టాలీవుడ్లో బాక్సాఫీస్ జోరు కొనసాగుతూనే ఉంది. ప్రతీవారం మూడుకు తగ్గకుండా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ భయాలు కూడా వెంటాడుతుండడంతో.. అవకాశం ఉన్న చిన్న సినిమాలన్నీ థియేటర్ బాట పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం కూడా మూడు చిత్రాలు లైన్లోకి వచ్చాయి. ఇందులో నితిన్ ‘రంగ్ దే’, రానా ‘అరణ్య’, సింహా ‘తెల్లవారితే గురువారం’ ఉన్నాయి.
వెంకీ అట్లూరి – నితిన్ కాంబోలో తెరకెక్కిన మూవీ రంగ్ దే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ మధ్య రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అలరించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ కు కామెడీ మిక్స్ చేసిన ఈ మూవీపై అంచనాలు మంచిగానే ఉన్నాయి.
రానా ‘అరణ్య’ కూడా మంచి స్వింగ్ లో ఉంది. బాహుబలి చిత్రం తర్వాత ఆ స్థాయిలో కష్టపడిన సినిమా ఇదేనంటూ ప్రమోషన్ జోరు కొనసాగిస్తున్నారు రానా. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. అడవులపై కన్నేసిన కార్పొరేట్లకు వ్యతిరేకంగా సాగే ఈ సినిమా.. థ్రిల్లింగ్ గా ఉంటుందని చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇక, ‘తెల్లవారితే గురువారం’ సినిమా హీరో సింహా.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపైనా అంచనాలు బాగానే ఉన్నాయి. బ్యాకెండ్ లో రాజమౌళి, కీరవాణి ఉండడంతో ప్రమోషన్ కూడా భారీగానే కొనసాగుతోంది. అయితే.. ఈ చిత్రం శనివారం బరిలోనిలుస్తోంది. మార్కెటింగ్ స్ట్రాటజీని అనుసరించి సోలో డేట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
మరి, ఈ మూడు చిత్రాల్లో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది? బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే సినిమా ఏదీ? అనే విషయం ఆసక్తిగా మారింది. చిన్నా, పెద్దా చిత్రాలనే తేడాలేకుండా.. పాజిటివ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు థియేటర్ బాట పడుతున్నారు. మరి, ఈ నేపథ్యంలో వారి మనసు గెలుచుకునే చిత్రం ఏదో చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Friday box office fight rang de aranya thellavarithe guruvaram
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com