https://oktelugu.com/

ఆ నిర్మాతల వల్ల హీరో నాని హర్ట్ అయ్యారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన హీరోల జాబితాను పరిశీలిస్తే అందులో నాని పేరు ముందు వరసలో ఉంది. టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని ఆ పేరు రావడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోలలో నానికి ఉండే డిమాండ్ మరే ఇతర హీరోలకు లేదు. వరుస సక్సెస్ లు హీరో నాని రేంజ్ ను అంతకంతకూ పెంచుతున్నాయి. అయితే గత నెల తొలి వారంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 18, 2020 / 09:00 AM IST
    Follow us on

    టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన హీరోల జాబితాను పరిశీలిస్తే అందులో నాని పేరు ముందు వరసలో ఉంది. టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని ఆ పేరు రావడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోలలో నానికి ఉండే డిమాండ్ మరే ఇతర హీరోలకు లేదు. వరుస సక్సెస్ లు హీరో నాని రేంజ్ ను అంతకంతకూ పెంచుతున్నాయి.

    అయితే గత నెల తొలి వారంలో సుధీర్ బాబుతో కలిసి నాని నటించిన వి సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా విడుదలైంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. నాని వి సినిమా ఫ్లాప్ కావడం ఆయన భవిష్యత్ ప్రాజెక్ట్ లపై పడిందని తెలుస్తోంది. నాని టాక్సీవాలా ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా తెరకెక్కాల్సి ఉంది.

    అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాతలు బడ్జెట్ ఎక్కువవుతుందనే సాకు చూపి ఈ సినిమా నిర్మాణం నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. సినిమా నిర్మిస్తామని చెప్పిన నిర్మాతలు మధ్యలో తప్పుకోవడం నానిని చాలా బాధ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

    అన్నీ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే టక్ జగదీష్ తరువాత శ్యామ్ సింగరయ మొదలు కావాల్సి ఉంది. అయితే నిర్మాతలు ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో నాని ఏ విధంగా ముందుకెళతాడో చూడాల్సి ఉంది.