
సంవత్సరం గడుస్తున్నా.. కరోనా వైరస్ ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉండటం, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద బాధ అయిపోయింది. స్టార్స్ కు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక సినిమా మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. పైగా ఎక్కువుగా షూటింగ్ స్పాట్ ల్లోనే కరోనా కలకలం సృష్టించడంతో ఇప్పుడు షూటింగ్ లనే ఆపాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆలియా భట్ కి, రణ్ బీర్ కపూర్ కి, మలైకాకి నిన్నటికి నిన్న నివేతా థామస్ కి కరోనా పాజిటివ్ వచ్చింది.
కాగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి కూడా ఈ ఉదయం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తమ అభిమాన కథానాయకుడికి కరోనా అని తేలడంతో అక్షయ్ అభిమానులు షాక్ కి గురి అయ్యారు. ఈ మధ్య వరుస షూటింగ్ లతో అందరితో సన్నిహితంగా ఉన్న అక్షయ్ కి కరోనా రావడంతో.. ఇప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉన్న మిగిలిన నటీనటులు కూడా తమ షూటింగ్స్ ను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా బాలీవుడ్ లో వరుసగా కేసులు వస్తుండంతో.. మిగిలిన మేకర్స్ లో ఆందోళన మొదలైంది.
ఇంకా ఎంతమందికి కరోనా సోకే అవకాశం ఉందో మరి. అయినా, సెకెండ్ వేవ్ లో కూడా కరోనా వైరస్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుండటం బాధాకరమైన విషయమే. పైగా సెలబ్రెటీలను కూడా వదిలిపెట్టకుండా వర్గభేదాలను కూడా చూడకుండా అది అందర్నీ కమ్మేస్తూ రావడంతో.. పేద వాళ్లల్లో ఇంకా భయాన్ని పెంచుతుంది. కరోనా తన విశ్వరూపాన్ని చూపించి మళ్ళీ విలయతాండవం చేయకముందే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటే మంచింది.