బాలీవుడ్ నుంచి వచ్చింది ఆ అందాల భామ, మంచి వ్యక్తిత్వం ఉంది, అంతకుమించిన మంచి నటన ఉంది. అలాంటి హీరోయిన్ కి ఎక్కడైనా అవకాశాలు వస్తాయి. అందుకే, తెలుగులో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. కానీ తెలుగు సినిమాలు చేసే మూడ్ లోనే ఆమె లేదు. బాలీవుడ్‌లో చాలా బిజీ అయిపోయింది ఆ బ్యూటీ. పైగా అక్కడ ఒక్కో సినిమాకీ 2 కోట్ల దాకా తీసుకుంటోందని.. అన్నిటికిమించి ఆమెకు బాలీవుడ్ లో ఈ మధ్య గౌరవం కూడా పెరిగిందని తెలుస్తోంది. మరి ఇలాంటి టైంలో ఓ యంగ్ తెలుగు హీరో సినిమాలో నటించేందుకోసం ఆమెను అడిగారు. ‘నేను చెయ్యను..’ అంటూ ఓ పెద్ద నిర్మాణ సంస్థతో మొహమాటం లేకుండా చెప్పేసింది. .ఎందుకంటే.. ఆ హీరోకి హిట్లు లేకపోవడమే కారణం అట.
విచిత్రం ఏమిటంటే.. ఆ హీరో ఏమైనా అడ్రెస్ లేని వాడు కూడా కాదు. అతనిది పెద్ద కుటుంబం, అతని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మంచి పట్టు ఉంది. పైగా ఇంట్లో స్టార్ హీరో ఉన్నాడు. అలాంటి హీరోకి హిట్లు లేకపోతేనేం, సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది, ఆడియో ఫంక్షన్స్ దగ్గర నుండి ప్రమోషన్స్ వరకూ ఎలాంటి డోకా లేకుండా అంత గొప్పగానే జరుగుతుంది. అయినా ఆ ముద్దుగుమ్మ మాత్రం పట్టించుకోలేదు. నటన విషయంలోనూ డాన్సుల విషయంలో తానూ గొప్ప నటిని అని ఆమె ఫీల్ అవుతూ ఉంటుందట. తనలో అంత మంచి క్వాలిటీస్ ఉన్నా తనకు ఎందుకు టాలీవుడ్ నుండి స్టార్ హీరోల సినిమాలు రావు అనే అసంతృప్తి ఆమెకు బాగా ఉందట.
అయినా అవన్నీ ఆ హీరోయిన్ బయట పెట్టదు. ఇప్పుడు వెళ్లి తెలుగు సినిమాల్లో తిరిగి నటించేదెప్పుడు? అని ప్రశ్నిస్తే, ‘మంచి ఆఫర్ వస్తే ఖచ్చితంగా చేస్తా’ అంటూ తన దైన స్టయిల్లో చిరునవ్వులు చిందించింది తప్ప, తెలుగు సినీ పరిశ్రమ తనను సరిగ్గా గుర్తించలేదు అని, తనకు సరైన అవకాశాలను ఇవ్వలేదు అని మాత్రం చెప్పదు. నిజానికి, ఆమె మరీ అంత ఓవరాక్షన్ చేసే టైపు కాదు. కానీ, ఎందుకో ఆమె వ్యవహార శైలిలో కొంత మార్పు వచ్చిందట ఈ మధ్య.
ఎప్పుడైతే హిందీలో తనకు స్టార్ డమ్ వచ్చిందో.. అప్పటి నుండి అమ్మడు ఫ్లాప్ హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదట. అయినా అడ్రస్ గల్లంతయిన హీరోల సరసన చేస్తే.. అస్సలే మాత్రం ప్రాధాన్యత లేని హీరోయిన్ గా మిగిలిపోతున్న హీరోయిన్లు ఎంతమంది లేరు. ఆమె నిర్ణయం కూడా సరైనదే అనుకోవాలి.