Homeసినిమా వార్తలుఅరె.. పెద్ద మనసు చాటుకున్న బాలయ్య !

అరె.. పెద్ద మనసు చాటుకున్న బాలయ్య !

Balakrishna
నట సింహం నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం అయినప్పటికీ, ఆయన మనసు మాత్రం స్వచ్ఛమైన వెన్న లాంటిది అని చెబుతూ ఉంటారు ఇండస్ట్రీలో. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు, వాళ్ళు తనను సాయం చేయమని అడగకపోయినా.. బాలయ్య వెంటనే వారికి సాయం చేస్తారని, ఆయనలో సేవా గుణం ఎక్కువ అని టాక్ ఉంది.

దానికి తగ్గట్లుగానే బాలయ్య బాబు కూడా ఎప్పటికప్పుడు తన సేవను ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఎంతో మందికి మేలు చేసే పని చేసి, తన పెద్ద మనసును చాటుకున్నారు. కరోనా వచ్చినప్పటి నుండి బాలయ్య పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. సెకెండ్ వేవ్ వచ్చిన తరువాత కూడా కరోనా రోగులకు అండగా 20 లక్షలు ఖర్చు పెట్టి పేదలకు మెడిసిన్ తో పాటు మెడికల్ సదుపాయాలను సమకూర్చాడు.

మళ్ళీ తాజాగా తన నియోజకవర్గ ప్రజలలో కొంతమంది కరోనా సోకి బెడ్స్ దొరకక ఇబ్బందులు పడుతుంటే, ఆ కరోనా రోగుల కోసం హిందీ పూర్ లోని తన గెస్ట్ హౌస్ లో బెడ్స్ ను ఏర్పాటు చేసి, వారికి వైద్యం చేయిస్తున్నాడు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గం ప్రజలలో ఎవరికీ కరోనా సోకినా, వారికీ అండగా నిలబడుతున్నాడు బాలయ్య. ప్రతి ఎమ్మెల్యే బాలయ్య బాబులా సేవ చేస్తే..

ఇక వైద్యం అందక చనిపోయే కరోనా పేషంటే ఉండడేమో. మొత్తానికి బాలయ్య చేస్తోన్న సేవ కార్యక్రమాలు గురించి తెలిసి, బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బాలయ్యను పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి కాంబోలో “అఖండ” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version