Siddharth Apologises: హీరో సిద్ధార్ద్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఏదో రకంగా వివాదాల్లోకి తల దూరుస్తూ ఉంటాడు. రీసెంట్ గా సైనా నెహ్వాల్ పై సెటైర్స్ వేస్తూ కాంట్రవర్సీ ట్వీట్ చేశాడు. ‘కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. షేమ్ ఆన్ యూ’ అంటూ ట్వీట్ పెట్టాడు. అంటే దీని అర్ధం ఏమిటంటే.. . ‘ఓ చిన్న కాక్ తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్. దేవుడి దయతో మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు’ అంటూ సిద్ధార్థ్ కాస్త వెటకారంగా ఆమెకు కామెంట్ పెట్టాడు.

అయితే, ఈ ట్వీట్ తీవ్ర రచ్చకు దారితీయడం, చివరకు హీరో సిద్దార్థ్ కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులివ్వడం వరకూ వెళ్ళింది ఈ వ్యవహారం. అలాగే ఓ మహిళ పై అసభ్యకరమైన భాషను వాడినందుకు సిద్ధార్థ్ ను కఠినంగా శిక్షించాలని కూడా జాతీయ మహిళా కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో చివరకు మన హీరోగారు సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెబుతూ ఓ పెద్ద లెటర్ నే ట్వీట్ చేశాడు.
ఇంతకీ ఆ బహిరంగ లేఖలో సిద్ధార్ద్ బాబు ఏం చెప్పుకొచ్చాడు అంటే.. ‘డియర్ సైనా.. నా ట్వీట్ తో చేసిన రూడ్ జోక్ కి, నేను నీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. సరదగా నేను ఒక జోక్ వేశాను. అయితే, అది అందరికీ తప్పుగా చేరింది. ఈ విషయంలో పెద్ద సారీ చెబుతున్నాను. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. అయినా, నా ట్వీట్‌లో జెండర్ కు సంబంధించిన విషయాలేవీ లేవు.
Also Read: మొన్న సమంత, నేడు సైనా.. పరువు పోగొట్టుకుంటున్న హీరో !
ఇక మీరు నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నాను’ అంటూ సిద్ధార్ద్ రిక్వెస్ట్ సైనాకు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అయినా అవమానించడం ఎందుకు, చివరకు క్షమాపణలు చెప్పడం ఎందుకు ? ఏమిటో సిద్ధార్ద్. అసలు సిద్ధార్థ్ కి వచ్చిన ఇబ్బందేంటో గానీ.. ఈ మధ్య తరుచూ ఇలా తనకు నచ్చినట్లు కామెంట్స్ చేస్తూ పోతున్నాడు. అయినా సామాజిక విషయాలపై తరచుగా స్పందించే సిద్ధార్ద్ కి మహిళల గౌరవాన్ని కాపాడాలని తెలియక పోవడం విచిత్రమే.
ఆ మధ్య సమంత విడాకుల ప్రకటన చేసిన వెంటనే ”మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు… ? అంటూ సిధ్దార్ద్ ఇన్ డైరెక్ట్ గా సామ్ పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. సిద్ధార్ద్ ఇప్పటికైనా మారితే మంచిది.
Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY
— Siddharth (@Actor_Siddharth) January 11, 2022
Also Read: రెడీ అంటున్న త్రిష.. త్వరగానే కోలుకుంది !