
సినిమాలో విలన్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనూసుద్ ఇక నుంచి విలన్ పాత్రలు చేయడట. ఇప్పటి నుంచి పాజిటివ్ పాత్రలే చేస్తానని ఈ పశుపతి ప్రకటించాడు. ఇప్పటి వరకు తాను బుక్ చేసిన సినిమాలను విడిచిపెడితే ఆ తరువాత సినిమాల్లో కేవలం పాజిటివ్ పాత్రలే ఉండేలా ఆయా చిత్రాల దర్శకులు కథను మార్చేస్తున్నారట. విలన్ పాత్రతో పేరు తెచ్చుకున్న సోనూసుద్ కరోనా సమయంలో పేద ప్రజలకు పేరు తెస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. అయితే అటు సేవ చేస్తూనే కొన్ని సినిమాలకు సంతకం చేశాడు. ఆ సినిమాల్లోనూ భయంకర విలన్ కాకుండా ఉండేలా ఆ సినిమా దర్శకులు రచించినట్లు తెలుస్తోంది.