
భారతీయ సంగీత దర్శక దిగ్గం రెహమాన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం మరణించారు. ఈ విషయాన్ని రెహమాన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశంసలు అందుకునేటప్పుడు రెహమాన్ తన తల్లిని గుర్తు చేసుకుంటాడు. తన తల్లిపై ఎనలేని ప్రేమ ఉన్న రెహమాన్ ఆమె లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కరీమా బేగం మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, ఇతరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయనను కలిసి పరామర్శిస్తున్నారు.రెహమాన్ చెన్నై టైమ్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో తన తల్లి గురించి చెప్పాడు ‘ఆమెకు సంగీత ప్రవ్రుత్తి ఉంది. మానసికంగా, ఆమె ఆలోచించే, తీసుకునే నిర్ణయం నాకన్నా చాలా ఎక్కువ. నేను సంగీతంలో రాణిస్తానని తెలుసుకున్నందువల్లే ఆమె నాకు 9వ తరగతిలోనే సంగీత క్లాసులు చెప్పించింది’.
— A.R.Rahman (@arrahman) December 28, 2020