
బిగ్‌బాస్ 4లో కార్యక్రమంలో సభ్యుడిగా ఉన్న నోయల్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంలో హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. అతను నడవలేని స్థితిలో ఉండడంతో అతనికి బీబీ డే కేర్ టాస్క్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. అయితే వైద్యులు పరిక్షించిన తరువాత మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రికి పంపించాలని సూచించడంతో హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈ విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని తోటి సభ్యులు పేర్కొన్నారు. హారిక మాత్రం నోయల్ వెళ్లడంపై తెగ ఏడ్చేసింది.