
ఆర్‌ఆర్‌ఆర్ ఎన్టీఆర్ భీం టీజర్‌పై వివాదం ముదురుతోంది. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్‌పై ఆదివాసీలు మండిపడుతున్నారు. నిజాం పాలనపై తిరుగుబావుట ఎగురవేసిన మన్యం వీరుడికి ఓ సామాజిక వర్గానికి చెందిన టోపీ ఎలా పెడతారంటూ తాజాగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో భీం పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలని, అలానే విడుదల చేస్తే థియేటర్లు తగులబెట్టే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.