
ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందలుో విజయశాంతి ప్రధాన పాత్రలో నటించింది. రష్మిక మందానా హీరోయిన్ గా అలరించింది. అయితే ఈ సినిమాలో తమిళంలో అనువదించి నేడు ఆ రాష్ట్రంలో విడుదల చేస్తున్నారు. తమిళనాడు మొత్తంగా 170 స్క్రీన్లలో ‘ఇవణ్ణుకు సరియానా అలిల్లై‘ పేరుతో విడుదలవుతోంది. కరోనా లాక్ డౌన్ తరువాత ఈ సినిమా విడుదల కావడంతో ఎంతో కాలంగా థియేటర్లకు రాని ప్రేక్షకులు ఈ సినిమా కోసం వస్తారని చిత్ర బ్రుందం అనుకుంటోంది. అయితే అన్ లాక్ మార్గ దర్శకాల ప్రకారం 50 శాతం సీట్లలో మాత్రమే ప్రేక్షకులను అనుమతిస్తారు. మరి ఈ సినిమా అక్కడ ఏ విధంగా కలెక్షన్లను కొల్లగొడుతుందో చూడాలి.