
మెగాస్టార్ చిరంజీవి త్వరలో నటించబోయే ‘లూసిఫర్’ చిత్రం ఈనెల 20 నుంచి షూటింగ్ జరిగే అవకాశాలున్నాయని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ ను తెలుగులు ‘బైరెడ్డి’గా నామకరణం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’లో నటిస్తున్నాడు. కోకాపేటలో ఏర్పాటు చేసిన భారీ సెట్ లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆ ప్రాంతాన్ని రామ్ చరణ్ కూడా సందర్శించారు. అయితే చిరు తరువాత నటించే చిత్రానికి కూడా ఎక్కువ సమయం తీసుకుకోకుండా షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.