
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఐసోలేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ఫ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల చిత్రం యూనిట్ లో ఓ వ్యక్తి మరణించారు. అయితే తరువాత ఆయనకు పాజిటివ్ ఉన్నట్లు రిపోస్టు వచ్చింది. దీంతో అప్రమత్తమైన సినిమా యూనిట్ చనిపోయిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. అయితే సుకుమార్ సదరు వ్యక్తికి దగ్గరగా లేకున్నా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో హీరోగా నటిస్టున్న అర్జున్ కు చనిపోయిన వ్యక్తి సన్నిహితంగా లేడని తెలుస్తోంది. అయితు మరో పదిరోజుల్లో లక్షణాలు ఎవరికైనా బయటపడితే టెస్టులు చేయించుకునే అవకాశం ఉంది.