
ప్రముక తెలుగు నటి ఛార్మి తల్లిదండ్రులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా విడిచిపెట్టలేదన్నారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రారంభం దశలోనే కరోనాను గర్తించి పరీక్షలు చేయించుకున్నారని, దీంతో ఆపద లేదని ఆమె తెలిపింది. తొందర్లో వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చార్మి తెలిపింది.