
మంచిర్యాల జిల్లాలోని జలాశయంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు భీమారంనకు చెందిన సంపత్, ఇరవేని రాజా బాపు, కలవేని రమేశ్, మచ్చ రవి, బొంతల రమేశ్ వెళ్లారు. వీరందరూ ప్రాజెక్టులోని నాటు పడవ ఎక్కి ప్రాజెక్టు మధ్యలోకి వెళ్లారు. అయితే ఒక్కసారిగా పడవ నీటమునిగింది. దీంతో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరు బొంతల రమేశ్, ఇరవేని రాజబాపులు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. కాగా శ్రీరాంపూర్ సీఐ బిల్లా, ఆర్డీవో రమేశ్ ఆధ్వర్యంలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.