
ఓ వైపు దేశంలో కరోనా తగ్గుతున్న సమయంలో ప్రముఖులు మాత్రం వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ నటి రకుల ప్రీత్ సింగ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు ఆమె తెలిపింది. అయితే ప్రస్తతం ఆరోగ్యంగానే ఉన్నానన్నారు. అయితే ఇటీవల తనను కలిసిన వాళ్లు అవసరమైతే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా రకుల్ ఇటీవల ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో పర్యటించారు. యోగా చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం రకుల్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తోంది.