https://oktelugu.com/

Chiranjeevi – Ravi Teja: చిరంజీవి, రవితేజ స్టార్ హీరోలు అయితే వాళ్ల ఫ్రెండ్స్ మాత్రం ఆ క్యారెక్టర్లు చేస్తున్నారు ఎందుకు..?

Chiranjeevi – Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే ఇండస్ట్రీ లో ఒకే టైంలో సినిమాలను స్టార్ట్ చేసి ఒకరు స్టార్ హీరోలుగా ఎదిగితే, మరొకరు ఇండస్ట్రీ లోనే నటులు గా రాణిస్తు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం… ముందుగా చిరంజీవి సుధాకర్ గురించి తెలుసుకుంటే వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాల పాటు రూమ్ మెట్స్ గా ఉన్నారు.ఇక వీళ్లు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో సినిమా ట్రైల్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2023 / 01:11 PM IST
    Follow us on

    Chiranjeevi – Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే ఇండస్ట్రీ లో ఒకే టైంలో సినిమాలను స్టార్ట్ చేసి ఒకరు స్టార్ హీరోలుగా ఎదిగితే, మరొకరు ఇండస్ట్రీ లోనే నటులు గా రాణిస్తు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…

    ముందుగా చిరంజీవి సుధాకర్ గురించి తెలుసుకుంటే వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాల పాటు రూమ్ మెట్స్ గా ఉన్నారు.ఇక వీళ్లు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో సినిమా ట్రైల్స్ చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ రూమ్ మేట్స్ గా ఉంటూ అవకాశాల కోసం అన్ని ఆఫీస్ లా చుట్టూ తిరిగేవారు. ఇక ఈ క్రమంలో చిరంజీవి కంటే ముందే సుధాకర్ కి సినిమాల్లో చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా చేసి ఆ తర్వాత విలన్ పాత్రలను కూడా చేసి చివరికి కమెడియన్ గా సెటిల్ అయిపోయాడు. అయితే చిరంజీవి మాత్రం నిదానంగా అవకాశాలు అందుకున్నప్పటికీ ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా ఎదుగుతూ మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు…ఇక ఇప్పుడు సుధాకర్ కి కొంచం ఆరోగ్యం బాగాలేక పోవడం తో ఆయన సినిమాలకి బ్రేక్ ఇచ్చాడు ఇక దాంతో ఇండస్ట్రీ లో ఇప్పుడు కొత్త కమెడియన్స్ వచ్చి సందడి చేస్తున్నారు. ఒకప్పుడు వెంకటేష్, జగపతి బాబు లాంటి హీరోల పక్కన ప్రతి సినిమాలో సుధాకర్ నటించేవాడు వాళ్ల కాంబో కి అప్పుడు మంచి డిమాండ్ ఉండేది…

    రవితేజ బ్రహ్మాజీ
    వీళ్లిద్దరూ కూడా ఇండస్ట్రీలో ఒకే టైంలో కెరియర్ ని స్టార్ట్ చేశారు.ముఖ్యంగా బ్రహ్మాజీ మొదట్లో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో బ్రహ్మాజీ హీరోగా నటించినప్పటికీ రవితేజ మాత్రం సెకండ్ హీరోగా నటించాడు. ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడకపోయినప్పటికీ వీళ్ళిద్దరికీ మాత్రం మంచి పేరు అయితే వచ్చింది. ఇక ఆ తర్వాత బ్రహ్మాజీ హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక రవితేజ హీరోగా చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో పాటుగా ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.
    ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా రవితేజ పేరు సంపాదించుకున్నాడు అలా ఇద్దరూ ఒకేసారి కెరియర్ ని స్టార్ట్ చేసినప్పటికీ ఎవరి టాలెంట్ ను బట్టి వాళ్ళు ఇండస్ట్రీ లో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతానికి బ్రహ్మాజీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ అరిస్ట్ గా కొనసాగుతున్నాడు…