
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ షూటింగ్ ను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని చిత్రం యూనిట్ తెలిపింది. కరోనా కారణంగా కొన్ని నెలలుగా నలిచిన ఈ సినిమా షూటింగ్ తిరిగి మంగళవారం ప్రారంభమవుతుందని తెలుపుతూ తాజాగా ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ నటించే ఈ సినిమా రేపటి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో జరిగే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందరన్న నటిస్తున్నారు.