
బాలీవుడ్, తెలుగు గ్లామర్ నటి పూజా హెగ్డే మంగళవారం 30వ బర్త్‌డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న ‘రాదేశ్యామ్’ మూవీకి సంబంధించిన మరో లుక్ విడుదల చేశారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన పూజా నటిస్తోంది. యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ పతాకాలపై వంశా, ప్రమోద్, ప్రసాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి అయిన పూజా తెలుగులో నటించిన సినిమాలన్నీ దాదాపు విజయం సాధించాయి. ఇటీవల వచ్చిన ‘అలా వైకుంఠపురం’లో బుట్టబొమ్మగా ప్రత్యేక ఆదరణ సంపాదించుకుంది. ఇదిలా ఉండగా ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.