Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు సినీ పరిశ్రమ బాగు కోసమే తాపత్రయ పడతారు. ముఖ్యంగా కొత్త టాలెంట్ ను ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నిజానికి ఎక్కువగా హీరోలు మెగా ఫ్యామిలీ నుంచే వస్తున్నారు అంటూ తమ ఫ్యామిలీ పై చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేసినా.. చిరు మాత్రం బయట వ్యక్తులకు కూడా తన సపోర్ట్ ను అందించారు. అందిస్తూనే ఉన్నారు.
యువ తరం విషయంలో చిరు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. అందరికీ అవకాశాలు రావాలని చిరంజీవి మొదటి నుంచి ఎంతో కృషి చేశారు, చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ మంచితనానికి ప్రోత్సాహానికి ఓ నటుడు స్టేజ్ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దృశ్యం జరిగి ఇప్పటికే వారం అవుతుంది. అయినా ఈ విజువల్స్ మాత్రం ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి.
Also Read: Chiranjeevi- Renu Desai: ఎదురుపడ్డ చిరంజీవిని చూసి రేణుదేశాయ్ షాకింగ్ రియాక్షన్
ఇంతకీ మ్యాటర్ లోకి వెళ్తే.. హీరోయిన్ తాప్సీ చాలాకాలం తర్వాత తెలుగులో నటించిన సినిమా మిషన్ ఇంపాజిబుల్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్ జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏప్రిల్ 1న భారీ స్థాయిలో విడుదల అయ్యింది. అయితే, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ వేడకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. కలర్ ఫోటో హీరో సుహాస్ పై ప్రశంసలు కురిపించారు. ఆ మాటలు విన్న నటుడు సుహాస్ అక్కడే కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అవుతూ కనిపించారు. ఇంతకూ చిరంజీవి ఏం మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ‘కరోనా పాండమిక్ వలన ఓటీటీలో వరుసగా సినిమాలన్నింటిని చూశాను. అలా చూస్తూ కలర్ ఫోటో సినిమాను చూశాను.
ఆ సినిమాలో సుహాస్ నటన చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు. ఒకవేళ నేను సినిమాలు చేసుకుంటూ పోతే కలర్ ఫోటో సినిమా చూసే అవకాశం మిస్ అయ్యేవాడిని. ఏది ఏమైనా సుహాస్ ఎంతో బాగా నటించారు’ అంటూ చిరు ప్రశంసలు కురిపించారు. దాంతో సుహాస్ బాగా ఎమోషనల్ అయ్యాడు.
Also Read:Shocking Story: పెళ్లయి 10రోజులైనా దగ్గరకు రానీయని భార్య.. ఆ వరుడికి అసలు నిజం తెలిసి షాక్
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More