Budget Impact On AP: ఆంధ్రప్రదేశ్‌కు ఏ కోసాన అయినా నిధులు కేటాయించకపోతారా అని కేంద్ర బడ్జెట్ పెట్టిన ప్రతిసారి ఆంధ్రులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రతి సారి ప్రత్యేక హోదా మీద ఏమైనా మాట్లాడుతారో లేదంటే కడప ఉక్కు కర్మాగారం గురించి ప్రకటన చేస్తారో లేకపోతే విశాఖలో పెట్టుబడులు ఏమైనా వస్తాయేమో అని ఇలా ప్రతిసారి ఎదురు చూడటం.. కేంద్రం బడ్జెట్ ప్రసంగంలో ఏపీ ముచ్చట తీయకపోవడం ఇలా సాగుతోంది.
ఈ సారి కూడా అత్యంత దారుణంగా ఏపీకి అన్యాయం చేసింది కేంద్రం. ఇప్పటికే ఏపీ చాలా వెనకబడిపోయిందని వాపోతున్నారు. అయినా కూడా ఏ విషయంలోనూ ఏపీకి విభజన హామీల్లో ఒక్క విషయంలో కూడా కేంద్రం న్యాయం చేయట్లేదు. పోలవరం ప్రాజెక్టు అలాగే విశాఖ రైల్వే జోన్ లకు కూడా ఎలాంటి నిధులు కేటాయించ లేదు. గత బడ్జెట్లో కూడా ఒక్క కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. ఈ సారి కూడా అనేక హామీలను మర్చిపోయింది కేంద్రం.
Also Read: బడ్జెట్ పై కేసీఆర్ రచ్చ రచ్చ.. జగన్ మౌనం.. బాబు మొహమాటం.. పవన్ స్పందన ఘోరం
ఇక గతంలో ప్రకటించిన రైల్వే ట్రాక్‌లకు నిధులు ఇవ్వలేదు. అలాగే రవాణా కారిడార్లకు కూడా మొండి చేయి చూపించింది. ఇక విశాఖ, విజయవాడ లో మెట్రో రైల్ ప్రాజెక్టు ఊసే లేదు. ఇప్పుడే కాదు.. రాష్ట్రం విడిపోయిన పదేండ్లుగా ఇలాగే కొనసాగుతోంది. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పినా.. ఆ విషయం ఎక్కడా వినిపంచట్లేదు. ఉపాధి కల్పన దిశగా పారిశ్రామిక పెట్టుబడులు ఏమైనా వస్తాయేమో అని ఆశించిన యూత్‌కు తీవ్ర అన్యాయమే జరిగింది.
ఏపీకి దక్షిణాది రాష్ట్రాల కంటే కూడా చాలా తక్కువగా నిధులు కేటాయిస్తూ వస్తోంది కేంద్రం. ఇక పోలవరం ప్రాజెక్టు అయిత కేంద్రం నిధులు ఇస్తే తప్ప ముందుకు సాగేట్లు కనబడట్లేదు. అయితే విద్యా సంస్థల పరంగా కూడా ఎలాంటి కొత్త యూనివర్సిటీలను ప్రకటించలేదు. ఇప్పుడు ఉన్న అనంతపురంలోని కేంద్రీయ విశ్వ విద్యాలయానికి మాత్రంరూ.56.66 కోట్లు కేటాయించింది. మొత్తం కొత్తగా ఏపీకి ఏమైనా వచ్చిందా అంటే నిరాశే అని చెప్పాలి.
Also Read: పోలవరం వదిలేసి ‘కెన్ బెత్వా’కు వేల కోట్లు.. మోడీ ఇది న్యాయమా?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Central budget impact on ap no money no projects
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com