Ysr Bima: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయనే సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ లో వైఎస్సార్ బీమా స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ బీమా స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏపీ ప్రభుత్వమే బీమాకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది.
ఏపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణించినా లేక సహజ మరణం పొందినా ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తి సహజంగా మరణిస్తే ఈ స్కీమ్ ద్వారా లక్ష రూపాయలు పొందవచ్చు.
18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం కలిగినా ఈ స్కీమ్ ద్వారా 5 లక్షల రూపాయలు లభిస్తాయి. బ్యాంక్ ఖాతాలో బీమా మొత్తం జమ కానుండగా బీమా క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోగా ఖాతాలో నగదు జమవుతుంది. ఈ స్కీమ్ కు అర్హత ఉన్నవాళ్లు కొన్ని డాక్యుమెంట్లను తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
ఏపీలో నివశిస్తూ ఉండటంతో పాటు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, ఇన్ కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, నివాస ధృవీకరణ సర్టిఫికెట్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. వాలంటీర్లను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.