కొత్త కారు కొనేవాళ్లకు ఎస్బీఐ శుభవార్త.. అతి తక్కువ వడ్డీ రేటుతో?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. కారు కొనుగోలుదారుల కొరకు స్పెషల్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ కారు కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తుండటం గమనార్హం. కియా కారును కొనుగోలు చేయడం ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్ కు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కారును కొనుగోలు చేస్తే 0.25 శాతం […]

Written By: Navya, Updated On : August 4, 2021 8:37 am
Follow us on

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. కారు కొనుగోలుదారుల కొరకు స్పెషల్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ కారు కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తుండటం గమనార్హం. కియా కారును కొనుగోలు చేయడం ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్ కు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కారును కొనుగోలు చేస్తే 0.25 శాతం వడ్డీ రేటు తగ్గడంతో పాటు కొత్త కారును కొనుగోలు చేసేవాళ్లకు ఊరట కలుగుతోందని సమాచారం. యోనో యాప్ ద్వారా కారు కొనుగోలు కోసం లోన్ కూడా తీసుకోవచ్చు. లోన్ తీసుకోవడం ద్వారా సులభంగా వడ్డీరేటు విషయంలో డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. కొత్త కారు కొనేవాళ్లకు ఈ ఆఫర్ ద్వారా అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరనుంది.

యోనో ద్వారా లోన్ తీసుకుంటే తక్షణ సూత్రప్రాయ ఆమోదం కూడా లభించే అవకాశాలు అయితే ఉంటాయి. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా లోన్ తీసుకోవడం ద్వారా వడ్డీరేటులో భారీ మొత్తం డిస్కౌంట్ ను కూడా పొందే అవకాశాలు ఉంటాయి. ఎస్బీఐ కొత్తకొత్త ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది.

దేశంలో ఎక్కువ సంఖ్యలో ఖాతాదారులు ఉన్న బ్యాంక్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పేరుంది. కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఎస్బీఐ కొన్ని స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ కొత్తకొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ప్రైవేట్ బ్యాంకులకు గట్టి పోటీని ఇస్తుండటం గమనార్హం.