https://oktelugu.com/

Cars: ఈ కారులో నిర్భయంగా వెళ్లొచ్చు.. సెక్యూరిటీ ఫీచర్స్ ఇవి.. వెంటనే కొనండి

కియా కంపెనీ ఒక మోడల్ ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ మోడల్ మిగతా వాటికంటే అత్యాధునికమైన ఫీచర్స్ తో పాటు భద్రత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంతకీ ఆ కారు ఏదో ఒకసారి చూద్దాం..

Written By:
  • Srinivas
  • , Updated On : December 4, 2023 4:41 pm
    kia-sonet

    kia-sonet

    Follow us on

    Cars: కారు కొనాలని ఈ మధ్య చాలా మంది ఆశపడుతున్నారు. సొంతంగా ఫ్యామిలీతో బయటకు వెళ్లాలంటే ఇతర వాహనాలతో ఇబ్బంది అనుకునేవారు సొంతంగా వెహికల్ ను లిగి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఏది మంచి కారు? ఎంత మైలేజ్ ఇస్తుంది? ధర ఎంత అని చూస్తున్నారు. ఇదే సమయంలో ఏ కారు అత్యంత భద్రతనిస్తుందోనని షోరూం నిర్వాహకులను అడుగుతున్నారు. ఈ తరుణంలో కియా కంపెనీ ఒక మోడల్ ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ మోడల్ మిగతా వాటికంటే అత్యాధునికమైన ఫీచర్స్ తో పాటు భద్రత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంతకీ ఆ కారు ఏదో ఒకసారి చూద్దాం..

    దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా కార్లు భారత రోడ్లపై దూసుకుపోతన్నాయి.కియా కంపెనీకి చెందిన సెల్టా, సోనేట్ వినియోగదారులను విపరీతకంగా ఆకర్షిస్తుంది. వీటితో సోనేట్ అప్డేట్ ఫీచర్స్ తో కొత్త డిజైన్ ను కలిగి రానుంది. 2024లో దీనిని ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కానీ అధికారికంగా మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. SUV వేరియంట్ లో వస్తున్న సోనెట్ ఫేస్ లిఫ్ట్ ఫీచర్స్ లేటేస్టీగా ఉన్నాయి.

    ఇందులో కొత్త ఎల్ ఈడీ డీఆర్ఎస్ తో కూడుకొన ఉంది. అల్లాయ్ వీల్స్ తో పాటు ర్యాప్ రౌండ్ టెయిల్ ర్యాంపులు ఉన్నాయి. ఇవి ఎల్ ఈడీ టైట్స్ కు కనెక్ట్ చేయబడ్డాయి. ఇందులో ప్రధానంగా ADAS గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సబ్ కాంటాక్ట్ ఎస్ యూవీ, హెచ్ బీఏసీ సిస్టమ్, రీ డిజైన్ చేసిన డ్యాష్ బోర్డు, అప్డేట్ చేసిన ఇన్ఫోసైన్మెంట్ సిస్టమ్ ను అమర్చారు. కొత్త అప్హోల్స్టరీ, ట్రిమ్ ను కూడా ఇందులో చూడొచ్చు.

    కియా సోనేట్ ఫేస్ లిప్ట్ 1.2 లీటర్ పెట్రోల్ ను, 115 బీహెచ్ పవర్ తో పాటు 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.0 లీటర్ టర్బో ఇంజిన్, 120 బీహెచ్ పీ పవర్, 172 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వెహికల్ 116 బీహెచ్ పీ పవర్, 250 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులు రక్షణకు అత్యధిక ప్రిపరెన్స్ ఇచ్చారు. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు. దీంతో ఇందులో ప్రయాణిస్తే సెక్యూరిటీ పక్కా అని కొందరు కొనియాడుతున్నారు.