YEAR ENDER 2024: మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ వస్తుంటాయి. కస్టమర్లకు అనుకూలంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు కంపెనీలో కొత్త ఫీచర్లతో తీసుకొస్తుంటాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లోకి ఎన్నో రకాల మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అందులో తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు వరకు ఉన్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇయర్ ఎండ్ కాబోతుంది. ఈ క్రమంలో ఏడాదిలో ఏ మొబైల్ ఫోన్లు ఎక్కువగా లాంఛ్ అయ్యాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే బెస్ట్ మొబైల్ ఫోన్లుగా నిలుస్తాయి. మరి ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన టాప్ 5 బెస్ట్ మొబైల్స్ ఏంటో చూద్దాం.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్(iPhone 16 Pro Max)
ఐఫోన్ ప్రతీ ఏడాది కొత్త సిరీస్‌ను లాంఛ్ చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్‌ను మార్కెట్‌లోకి లాంఛ్ చేసింది. ఈ ఏడాది ఎక్కువగా పాపులర్ అయిన వాటిలో ఇది ఒకటి. ముఖ్యంగా ఈ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అయితే మార్కెట్‌లో ఒక బెస్ట్ మొబైల్‌గా నిలిచింది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఈ ఏడాది అత్యంత ప్రీమియం మోడల్. ఈ ఫోన్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,44,900గా మార్కెట్లో ఉంది. అయిన కూడా ఈ మొబైల్ అమ్మకాల సంఖ్య బాగా పెరిగింది. ఫోన్ 6.90 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉండటంతో పాటు యాపిల్ ఏ18 ప్రో చిప్‌తో అమర్చారు. ఈ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌కి 48MP + 12MP + 48MP బ్యాక్ కెమెరా ఉండటంతో పాటు 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.
శ్యామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్24 అల్ట్రా(Samsung Galaxy S24 Ultra)
మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ ఫోన్లలో ఇది ఒకటి. శ్యామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ ధర మార్కెట్‌లో రూ.1,29,999గా ఉంది. అయితే ఈ ఫోన్‌కి మొత్తం 6.80 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇదే కాకుండా.. ఈ ఫోన్‌ను స్నాప్ డ్రాగన్ 3 చిప్‌తో అమర్చారు. అలాగే ఈ మొబైల్ బ్యాటరీ 5000mAh.
గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఎక్స్‌ఎల్
గూగుల్ పిక్సిల్ 9 సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్ ఇది. మార్కెట్‌లోకి వచ్చిన గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ ధర రూ.1,24,999గా ఉంది. ఈ ఫోన్ 6.80 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండటంతో పాటు ఇందులో గూగుల్ టెన్షర్ జీ4 చిప్‌ను అమర్చారు. ఫోన్ 50MP + 48MP + 48MP వెనుక, 42MP ఫ్రంట్ కెమెరా ఉంది.
వివో ఎక్స్200 ప్రో(Vivo X200 Pro)
మార్కెట్‌లోకి వచ్చిన వివో ఎక్స్200 ప్రో(Vivo X200 Pro) ధర రూ.94,899గా ఉంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండటంతో పాటు బలమైన మీడియా టెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో అమర్చారు. వివో ఎక్స్200 ప్రో మొబైల్‌కి 50MP + 50MP + 50MP వెనుక, 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ 6000mAh.
iQOO 13 5G
iQOO 13 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ధర రూ. 54,999. ఈ ఫోన్ 6.82 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఫోన్ బలమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో అమర్చారు.