Yamaha Zuma 125 Review: యూత్ ఐకాన్ గా ఉండే Yamaha కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎన్నో అట్రాక్షన్ తో కూడిన బైక్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే మధ్యలో కొంతకాలం ఈ బైక్స్ తక్కువగా ఆదరణకు గురైనప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ఉంచుకునేందుకు కొత్త తరహా వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. లేటెస్ట్ గా Yamaha కంపెనీకి చెందిన Zuma 125 CC అనే బైక్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. అయితే దీనికి సంబంధించిన చిత్రాలు ఆన్లైన్లో రావడంతో యూత్ బాగా టెంప్ట్ అవుతున్నారు. దీని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చెబుతున్నారు. ప్రాథమికంగా అందుతున్న వివరాల ప్రకారం ఈ బైక్ స్టైలిష్ గా ఉండడం మాత్రమే కాకుండా అత్యధిక మైలేజ్ ని కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బైక్ గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..
Yamaha Zuma 125 cc ఇంజన్ నువ్వు అప్డేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ను సెట్ చేశారు. ఇది లీటర్ ఇంధనానికి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో 1.6 గాలన్ ట్యాంకు ఉండడంతో సుదీర్ఘ ప్రయాణం చేసే వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ బైక్ డిజైన్ చూస్తే ఎవరైనా యూత్ ఇంప్రెస్ కావాల్సిందే. బోల్డ్ స్టైలింగ్ డిజైన్‌తోపాటు చంకీ టైర్లతో ఉన్న ఈ బైక్ కేవలం అందంగా ఉండటమే మాత్రమే కాకుండా బలమైన ఫ్రేమ్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతో నగరాల్లో ప్రయాణం చేసే వారికి ఆకర్షణీయంగా కల్పిస్తారు. అంతేకాకుండా రోజువారి ప్రయాణికులకు కూడా అనుగుణంగా ఉంటుంది.
సాధారణంగా ప్రతిరోజు బైక్ పై ప్రయాణం చేసేవారు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఈ బైక్ ఇంజన్ తోపాటు బ్లూ కోర్ VVA ఇంజన్ ఉండడంతో ఇందులో పవర్ ప్లాంట్ కూడా రెస్పాన్సివ్ ఉండనుంది. అంతేకాకుండా చిన్నచిన్న రైడర్స్ కు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దూర ప్రయాణాలు చేసినా ఎలాంటి అలసట ఉండదు. దీనిపై ఉండే సీటింగ్ విశాలంగా ఉండడంతో అలసట తగ్గిపోతుంది. వారాంతపు సెలవుల్లో కూడా విహారయాత్రలకు దీనిపై వెళ్లినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఈ బైక్ లో డిస్క్ బ్రేక్ ప్రత్యేకంగా నిలబడి ఉంది. ఇవి ట్రాఫిక్ లో ప్రయాణం చేసినా అనుగుణంగా బ్రేకింగ్ ఫోర్స్ ఉంటుంది. అలాగే దీనికుండే దృఢమైన టైర్లు కూడా సస్పెన్షన్ స్థిరత్వాన్ని అందిస్తాయి. ఈ బైక్‌లో స్మార్ట్ ఫీచర్స్ ను కూడా అమర్చారు. స్పష్టమైన LCD డిస్ప్లే ఉండడంతో నావిగేషన్ ఈజీగా తెలిసిపోతుంది. అంతేకాకుండా USB పోర్టుతో కూడా మొబైల్ ఛార్జింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఫీచర్ రైడర్ కు సపోర్ట్ గారే ఉంటుంది. ఇక ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ బైక్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనిని రూ.63,799 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. పట్టణ ప్రయాణికులతో పాటు నగర వాసులకు అనుగుణంగా ఉండే ఈ బైక్ కొనుగోలు చేయాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు.