Xiaomi 2026: చైనా కంపెనీ Xiaomi 2026 కొత్త సంవత్సరం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తన మొబైల్స్ తయారీలో చిప్ సెట్, ఆపరేటింగ్ సిస్టం, AI వంటి అప్లికేషన్ల కోసం ఇతర సంస్థలపై ఆధారపడేది. కానీ ఇప్పుడు కొత్తగా సొంతంగా తయారు చేయడానికి ప్రణాళికలు వేస్తుంది. ఇప్పటివరకు ఈ కంపెనీ Qualcomm, Google పై ఆధారపడేది. Huawei మాదిరిగా పూర్తిగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించాలని చూస్తోంది. ఇలా చేయడం వల్ల మార్కెట్లో ఈ కంపెనీ ఆధిపత్యం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఈ ఫోన్లో కొనుగోలు చేసిన వారి డేటా భద్రత కూడా భంగం కాకుండా ఉండగలుగుతుందని భావిస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
2026 కొత్త సంవత్సరంలో Xiaomi కొత్త తరహాలో మొబైల్స్ రానున్నాయి. ఇప్పటివరకు ఈ మొబైల్స్ కొనుగోలు చేసిన వారిలో డేటా భద్రత, ప్రైవసీ గురించి ఆందోళన ఉండేది. కానీ ఇకనుంచి ఆ సమస్య లేకుండా ఉండాలని కంపెనీ భావిస్తుంది. ఇందులో భాగంగా సొంత చిప్ (XRING 02), Hyper 3.0., MiMo AI నీ ఒకే స్మార్ట్ ఫోన్ లో ఉండే విధంగా తయారు చేయబోతోంది. దీంతో ఇప్పటివరకుQualcomm, Google పై ఉండే ఆధారాన్ని తగ్గించాలని అనుకుంటుంది. ఈ ఫోన్లో కొత్తగా అమర్చే చిప్ TSMC 3nm ప్రాసెస్ తో పని చేయనుంది. ఇది 19 బిలియన్ ట్రాన్సిస్టర్లు, 10 కోర్ CPU వంటివి కలిగి ఉన్నాయి. కొత్తగా వచ్చే చిప్ 3nm పై ఆధారపడుతుంది. దీంతో లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన మొబైల్ NPU తో లోకల్ AI నీ అందిస్తుంది.
Hyper OS 3.0 లో సూపర్ ఐస్లాండ్ ఏఐXiaomi అసిస్టెంట్ క్వాంటం ఎన్క్రిప్షన్, ఆఫ్లైన్ డివైస్ సెర్చ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది ఆపిల్ మొబైల్ లో ఉండే ఫీచర్లకు సమానంగా ఉంటుంది. ఈ ఫీచర్లను మొబైల్లో తీసుకురావడం వల్ల మార్కెట్లో ఆపిల్ ఫోన్లపై ఆధిపత్యాన్ని చలాయించే అవకాశం ఉందని అంటుంది. అంతేకాకుండా చైనాలో 15.2% మార్కెట్ షేర్, ఇండియాలో 18.7 తో ఉన్న ఈ కంపెనీకి కొత్త ఫోన్ రాకతో మరింతగా లాభాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ముఖ్యంగా కొత్త సంవత్సరంలో ఈ కొత్త ప్లాన్ తో రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలలో ఈ కంపెనీ 105 బిలియన్ల యువాన్లను ఖర్చు చేసింది. ఇప్పుడు పెట్టే కొత్త పెట్టుబడులతో మరింతగా మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు.