Pension Scheme: ప్రభుత్వ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత కూడా పెన్షన్ పొందే అవకాశం ఉండగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఆ అవకాశం ఉండదనే సంగతి తెలిసిందే. పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ద్వరా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ స్కీమ్ ను నిర్వహిస్తోంది. ఈ స్కీమ్ లో రోజుకు 7 రూపాయల కంటే తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసి పదవీ విరమణ తర్వాత బారీ మొత్తం పెన్షన్ పొందవచ్చు.

అసంఘటిత రంగానికి చెందిన వాళ్లకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులని చెప్పవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు కనీసం 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ మెంట్ ను కొనసాగించాలి. ఈ విధంగా ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మరణించే వరకు పెన్షన్ ను పొందవచ్చు.
Also Read: రైతులకు కేంద్రం శుభవార్త.. ఖాతాలో రూ.2,000 జమయ్యేది ఎప్పుడంటే?
పెట్టుబడిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామి పెన్షన్ ను పొందవచ్చు. ఇద్దరు మరణిస్తే మిగిలిన మొత్తం కార్పస్ నామినీ ఖాతాలో జమవుతుంది. 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ పొందే ఛాన్స్ ఉండగా ఆ మొత్తాన్ని బట్టి ఇన్వెస్ట్ మెంట్ పెంచాల్సి ఉంటుంది. నెలకు 210 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 60 సంవత్సరాల తర్వాత నెలకు 5,000 రూపాయల చొప్పున సంవత్సరానికి సంవత్సరానికి 60,000 రూపాయలు పొందవచ్చు.
40 సంవత్సరాల వయస్సులో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే మాత్రం రూ. 1,454 విరాళంగా చెల్లించలి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
Also Read: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఇలా చేస్తే మీ అకౌంట్ పని చేయదట!