Coconut Prices Drop: కొబ్బరి పంటకు కోనసీమ ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్లోని ఈశాన్య గోదావరి, విశాఖపట్నం, ఏలూరు, శ్రీకాకుళంలో ఎక్కువగా కొబ్బరి వ్యాపారం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఉన్న కొబ్బరి చెట్లే కొబ్బరి సాగుకు ప్రధానంగా నిలుస్తున్నాయి. ఇక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే కాకుండా దేశంలోని పలు ప్రాంతాలకు కూడా కొబ్బరికాయలు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే కొబ్బరికాయలు కాలాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి. మొన్నటి వరకు పండుగల సీజన్ సందర్భంగా కొబ్బరికాయల ధరలు ఆకాశానికి దిగబాకాయి. కానీ ఇప్పుడు పండుగల సీజన్ ముగియడంతో కొబ్బరికాయ ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కొబ్బరికాయల ధరలు ఎలా ఉన్నాయంటే?
శ్రావణమాసం నుంచి కార్తీక మాసం వరకు ఆధ్యాత్మిక సీజన్ గా భావిస్తారు. ఈరోజుల్లో ఎక్కువగా పండుగలు, పూజలు, వ్రతాలు ఉంటాయి. దీంతో కొబ్బరికాయలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఈ క్రమంలో అప్పటివరకు కొబ్బరి సాగు చేసిన రైతులకు మంచి లాభం వస్తుంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ మధ్య వరకు వెయ్యి కొబ్బరికాయల ధరలు రూ. 27,000 నుంచి రూ.28,000 లకు విక్రయించారు. కురిడి కొబ్బరి రూ.26,000 లతో విక్రయించారు. అయితే ప్రస్తుతం పండుగల సీజన్ ముగిసింది. దీంతో కొబ్బరికాయలు అవసరం తగ్గింది. ఫలితంగా డిమాండ్ తగ్గి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 1000 కొబ్బరికాయలకు రూ.22,000 నుంచి రూ.23,000 పలుకుతోంది. అయితే మొన్నటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నా కొబ్బరి రైతులు.. ఇప్పుడు ధర తగ్గడంతో నిరాశతో ఉన్నారు. ఇది సాధారణమే అయినప్పటికీ ఈసారి విపరీతమైన డిమాండ్ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
కొబ్బరి పంటలు ఎక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో కనిపిస్తాయి. 2022 -23 సంవత్సరంలో దేశంలో అత్యధిక ఉత్పత్తి చేసిన జిల్లాగా నిలిచింది. ఇక్కడ సుమారు 7585 హెక్టార్లలో కొబ్బరి చెట్లు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఉన్న చెట్లు 25.8 లక్షల కొబ్బరికాయలను ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత కృష్ణ జిల్లాలో సుమారు 846 ఎకరాలలో కొబ్బరికాయల ఉత్పత్తి చేస్తారు. ఈ జిల్లాలో కొబ్బరి చెట్లు సముద్ర తీరం లో ఉండడంతో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో ఇక్కడ అనుకూలమైన ఉత్పత్తి ఉంటుందని రైతులు చెబుతారు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పశ్చిమగోదావరి జిల్లా కొబ్బరి కాయల ఉత్పత్తిలో ప్రత్యేకతలు సాధించుకుంది.
కొబ్బరికాయల ఉత్పత్తి తగ్గినప్పటికీ కొందరు అగ్రి టూరిజం పేరిట ఈ తోటలను అద్దెకు తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి విలాసాలుగా ఉండేందుకు వారు ప్రత్యేకమైన వ్యాపారం చేస్తున్నారు. దీంతో కొన్నాళ్లపాటు రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది.