https://oktelugu.com/

Whatsapp: వాట్సాప్ సూపర్ ఫీచర్.. ఆ అధికారం అడ్మిన్ లకు మాత్రమే?

Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుండగా వాట్సాప్ ను వినియోగించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ యాప్ సహాయంతో మనకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో సులభంగా పంచుకోవడం సాధ్యమవుతుంది. వాట్సాప్ గ్రూప్స్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతోంది. అయితే చాలా సందర్భాల్లో వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులు పోస్ట్ చేసే పోస్టుల వల్ల అడ్మిన్స్ కు లేనిపోని తలనొప్పులు వస్తుంటాయి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 15, 2021 / 07:39 PM IST
    Follow us on

    Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుండగా వాట్సాప్ ను వినియోగించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ యాప్ సహాయంతో మనకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో సులభంగా పంచుకోవడం సాధ్యమవుతుంది. వాట్సాప్ గ్రూప్స్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతోంది.

    Whatsapp New Feature

    అయితే చాలా సందర్భాల్లో వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులు పోస్ట్ చేసే పోస్టుల వల్ల అడ్మిన్స్ కు లేనిపోని తలనొప్పులు వస్తుంటాయి. సాధారణంగా గ్రూప్ లో ఏదైనా మెసేజ్ ను డిలీట్ చేయాలంటే మెసేజ్ పంపిన వ్యక్తి మాత్రమే డిలీట్ చేయవచ్చు. అయితే ఈ పరిస్థితి నుంచి అడ్మిన్స్ కు ఇబ్బందులు ఎదురు కాకుండా వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో అడ్మిన్ లు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే మెసేజ్ లను డిలీట్ చేయవచ్చు.

    Also Read: మళ్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ఫస్ట్ మ్యాచ్.. ఈసారి ఏం జరుగనుంది?

    త్వరలోనే ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రూప్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న మెసేజ్ లను, అభ్యంతరకంగా ఉన్న మెసేజ్ లను గ్రూప్ అడ్మిన్స్ సులభంగా డిలీట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గ్రూప్ లో ఎంతమంది అడ్మిన్స్ ఉంటే అంతమంది అడ్మిన్స్ ఈ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు.

    వాట్సాప్ ఈ ఫీచర్ తో పాటు డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా 16 సెకన్లు, 8 నిమిషాలు, గంటలో మెసేజ్ ను డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్లతో పాటు కొత్త ఫీచర్లను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. పది అర్హతతో కోస్ట్ గార్డ్ లో ఉద్యోగ ఖాళీలు?