https://oktelugu.com/

వాట్సాప్ సెక్యూరిటీ కోడ్ నోటిఫికేషన్లు వస్తున్నాయా.. వాటిని ఎలా ఆపాలంటే?

దేశంలో కోట్ల సంఖ్యలో వాట్సాప్ యూజర్లు ఉండగా వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ తాజాగా యూజర్లకు మల్టీ డివైజ్ ఫీచర్ అప్ డేట్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ వల్ల ఫోన్లలో సెక్యూరిటీ కోడ్ ఛేంజ్డ్ అనే మెసేజ్ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. యూజర్ వాట్సాప్ ను అప్ డేట్ చేసినా కొత్త ఫీచర్ వచ్చినా వేరే ఫోన్ లో యాప్ ను ఇన్ స్టాల్ చేసినా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 9, 2021 7:45 pm
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో వాట్సాప్ యూజర్లు ఉండగా వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ తాజాగా యూజర్లకు మల్టీ డివైజ్ ఫీచర్ అప్ డేట్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ వల్ల ఫోన్లలో సెక్యూరిటీ కోడ్ ఛేంజ్డ్ అనే మెసేజ్ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. యూజర్ వాట్సాప్ ను అప్ డేట్ చేసినా కొత్త ఫీచర్ వచ్చినా వేరే ఫోన్ లో యాప్ ను ఇన్ స్టాల్ చేసినా సెక్యూరిటీ కోడ్ మారుతోంది.

    కొంతమంది తరచూ ఈ విధంగా సెక్యూరిటీ కోడ్ మారడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాట్సాప్ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన మల్టీ డివైజ్ ఫీచర్ ద్వారా ప్రస్తుతం ఉపయోగించే డివైజ్ కాకుండా మరో మూడు డివైజ్ లలో వాట్సాప్ ను వినియోగించుకునే సౌకర్యం ఉంటుంది. సెక్యూరిటీ కోడ్ మారడం గురించి యూజర్లు కంగారు పడాల్సిన అవసరం లేదని వాట్సాప్ బీటా ఇన్ఫో తాజాగా వెల్లడించింది.

    వాట్సాప్ లో మనం చేసే ప్రతి చాటింగ్ కు ప్రత్యేకమైన సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ కోడ్ మెసేజ్ లను వెరిఫై చేయడంతో పాటు ఇతరులు వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేయకుండా చేస్తుంది. అయితే ఈ ఫీచర్ ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసే అవకాశం ఉంటుంది. వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ ను క్లిక్ చేయడం ద్వారా వెరిఫై సెక్యూరిటీ కోడ్ అనే ఫీచర్ వాట్సాప్ లో కనిపిస్తుంది.

    వాట్సాప్ లో సెట్టింగ్స్ లో సెక్యూరిటీ ఓపెన్ చేసి ఈ విధంగా చేయడం ద్వారా వాట్సాప్ కాంటాక్ట్స్ లో ఎవరి సెక్యూరిటీ కోడ్ మారినా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాట్సాప్ సెట్టింగ్స్ లో షో సెక్యూరిటీ కోడ్ అనే ఆప్షన్ ను డిసేబుల్ చేయడం ద్వారా సెక్యూరిటీ కోడ్ ఛేంజ్డ్ అనే నోటిఫికేషన్లను పొందే అవకాశం ఉండదు.