WhatsApp: కొత్త సంవత్సరంలో అదిరిపోయే వాట్సాప్ ఫీచర్స్.. అవేమిటంటే!

WhatsApp: సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2 బిలియన్ యూజర్లు వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. ఇకపోతే ఈ వాట్సాప్ కి పోటీగా టెలిగ్రామ్, వైబర్, సిగ్నల్ వంటి యాప్స్ వస్తున్నప్పటికీ వినియోగదారులు మాత్రమే వాట్స్అప్ నుంచి పక్కకు వెళ్ళకుండా ప్రతిసారీ అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువస్తే వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా వాట్స్అప్ అదిరిపోయే ఫీచర్స్ తో […]

Written By: Navya, Updated On : January 3, 2022 2:45 pm
Follow us on

WhatsApp: సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2 బిలియన్ యూజర్లు వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. ఇకపోతే ఈ వాట్సాప్ కి పోటీగా టెలిగ్రామ్, వైబర్, సిగ్నల్ వంటి యాప్స్ వస్తున్నప్పటికీ వినియోగదారులు మాత్రమే వాట్స్అప్ నుంచి పక్కకు వెళ్ళకుండా ప్రతిసారీ అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువస్తే వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా వాట్స్అప్ అదిరిపోయే ఫీచర్స్ తో మన ముందుకు వస్తోంది. మరి ఆ ఫీచర్స్ ఏంటి అనే విషయానికి వస్తే..

ఇప్పటిదాకా వాట్సాప్ సెట్టింగులో డిలీట్ మై అకౌంట్ అనే బటన్ కనిపిస్తుంది. ఇకపై ఈ ఆప్షన్ మనకు కనిపించదు. ఈ ఆప్షన్ స్థానంలో లాగ్ అవుట్ మై అకౌంట్ అనే ఆప్షన్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.డిలీట్ మై అకౌంట్ బటన్ ఉండటం వల్ల దానిపై క్లిక్ చేస్తే మన వాట్సప్ అకౌంట్ డిలీట్ అవ్వడమే కాకుండా అందుకు సంబంధించిన చాట్, వాట్సాప్ కాంటాక్ట్స్ అన్ని డిలీట్ అవుతాయి. ఇకపై అలాంటి సమస్య ఉండకుండా మనం వాట్సాప్ నుంచి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే లాగౌట్ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. తిరిగి మనకు కావలసినప్పుడు లాగిన్ అవ్వొచ్చు. ఇలా చేయటం ద్వారా ఏ విధమైనటువంటి వాట్సాప్ చాట్ డిలీట్ కాదు.

అదే విధంగా ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ రీల్స్ కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఇలా చాలా మంది ఈ రీల్స్ చూడడం కోసం ఇంస్టాగ్రామ్ కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఆ సమస్య లేకుండా వాట్సాప్ లోనే ఇంస్టాగ్రామ్ రీల్స్ అనే మరో సెక్షన్‌లా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక అందుబాటులోకి వస్తే ఎంతోమందికి వాట్సాప్ లోనే పూర్తి సమయం గడిచిపోతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా చాలామంది గ్రూప్ మెసేజెస్ వల్ల ఎంతో విసుగు చెందుతుంటారు. అయితే ఈ మెసేజెస్ అప్పటి చదవడానికి టైం కుదరకపోయినా తరువాత చదవాలనుకునే వారికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న
ఆర్కీవ్స్‌ ఫీచర్‌ను మరికొంత ఆధునీకరించి రీడ్‌ లేటర్ అనే ఆప్షన్‌ను వాట్సాప్‌ తీసుకురాబోతుంది. అయితే ఈ రీడ్ లెటర్ ఆప్షన్ వల్ల ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయం ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే కానీ మిగతా వివరాలు తెలియవు.