Whats App: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక ఆ ఇబ్బంది తొలగినట్లే..

కొత్త ఫీచర్ ప్రకారం ఒకే సారి అన్ని మెసేజ్ లు కాకుండా ప్రత్యేకమైన కొన్ని కేటగీరీల కాంటాక్స్ మెసేజ్, గ్రూప్ నకు సంబంధించిన మెసేజ్ లు వేర్వేరుగా చూసుకునే అవకాశం ఉంది. అంటే గ్రూపులన్నీ ఒక వైపు కేటరిగీలకు సంబంధించిన చాట్స్ ఒక వైపు వచ్చేలా సౌకర్యాన్ని కలిగించారు. దీంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన మెసేజ్ కాంటాక్ట్ నెంబర్ నుంచి వచ్చిందా? లేక గ్రూప్ లో వచ్చిందా? అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.

Written By: Chai Muchhata, Updated On : April 17, 2024 3:54 pm

Whatsapp new feature

Follow us on

Whats App: ప్రపంచీకరణలో భాగంగా రోజురోజుకు వినియోగదారుల అభిరుచులు మారిపోతున్నాయి. ప్రతీ పనిని టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈజీగా చేయగలుగుతున్నారు. కమ్యూనికేషన్ లో భాగంగా వాట్సాప్ ప్రధాన వేదికగా మారింది. దీని ద్వారా ఎన్నో పనులు చేసుకుంటున్నారు. మెసేజ్ తో పాటు ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ పంపించుకుంటున్నారు. అయితే యూజర్స్ కు అనుగుణంగా మెటా సంస్థ ఎప్పటికప్పుడు యాప్ ను అప్డేట్ చేస్తోంది. కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఆకర్షిస్తోంది. లేటేస్ట్ గా సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదెలా ఉందంటే?

ప్రతి ఒక్కరి వాట్సాప్ లో ఎంతో మంది కాంటాక్ట్ అవుతుంటారు. వివిధ గ్రూపులు క్రియేట్ అయి ఉంటాయి. ఏదైనా మెసేజ్ వస్తే చూసుకోడానికి కొంతమందికి ఇబ్బంది కలుగుతోంది. ఒకవేళ నోటిఫికేషన్ సెట్ చేసుకున్నా.. వందల కొద్ది మెసేజ్ రావడంతో అన్నింటిని చూడడానికి సమయం ఉండదు. ఇంపార్టెంట్ మెసేజ్ లు మాత్రమే చూసే అవకాశం లేదు. అయితే తాజాగా ఈ ఇబ్బందిని గుర్తించిన యాప్ వినియోగదారుల సౌలభ్యం కోసం పిల్టర్ చేసి అసవరమైన మెసేజ్ లు మాత్రమే చూసుకునే అవకాశాన్ని కల్పించింది.