https://oktelugu.com/

Home Loan: కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అతి తక్కువ వడ్డీకే ఆ సంస్థ రుణాలు!

Home Loan:  ప్రముఖ హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలలో ఒకటైన బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ కొత్తగా ఇల్లు కొనాలని భావించే వాళ్లకు తీపికబురు అందించింది. కొత్త సంవత్సరం కానుకగా స్పెషల్ ఆఫర్ ను ఈ సంస్థ ప్రకటించింది. గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని భావించే వాళ్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ఈ సంస్థ ముందుకు రావడం గమనార్హం. కొత్త సంవత్సరం కానుకగా ఈ సంస్థ ఆఫర్ ను ప్రకటించింది. బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ వెబ్ సైట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 30, 2021 / 10:34 AM IST
    Follow us on

    Home Loan:  ప్రముఖ హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలలో ఒకటైన బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ కొత్తగా ఇల్లు కొనాలని భావించే వాళ్లకు తీపికబురు అందించింది. కొత్త సంవత్సరం కానుకగా స్పెషల్ ఆఫర్ ను ఈ సంస్థ ప్రకటించింది. గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని భావించే వాళ్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ఈ సంస్థ ముందుకు రావడం గమనార్హం. కొత్త సంవత్సరం కానుకగా ఈ సంస్థ ఆఫర్ ను ప్రకటించింది.

    Home Loan

    బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ వెబ్ సైట్ ద్వారా హోమ్ లోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ లోన్ తీసుకోవాలంటే కచ్చితంగా కొన్ని అర్హతలు ఉండాలి. మల్టీ నేషనల్ కంపెనీల్లో లేదా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఎక్కువ సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు మాత్రమే ఈ రుణం తీసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. కనీసం మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉన్నవాళ్లు మాత్రమే ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

    Also Read:  జియో యూజర్లకు అలర్ట్.. ఈ విధంగా మోసపోయే అవకాశాలు ఎక్కువట?

    డాక్టర్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా శాలరీ వచ్చే ఉద్యోగి అయితే మాత్రమే ఈ లోన్ కు అర్హులని చెప్పవచ్చు. బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ కొంతకాలం పాటే ఈ స్కీమ్ ను అందించనుంది. సిబిల్ స్కోరు 750 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మత్రమే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా 2022 సంవత్సరం జనవరి 26వ తేదీలోపు రుణదాత దరఖాస్తు చేసుకోవాలి.

    2022 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీలోపు రుణం తీసుకుంటే మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. సమీపంలోని బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ బ్రాంచ్ ను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

    Also Read:  నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏంటో తెలుసా.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?