WagonR for Rs 2 lakhs: కారు కొనాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ కొందరి వద్ద సరైన బడ్జెట్ ఉండదు. దీంతో కారు కొనాలని కోరికను పక్కన పెడుతూ ఉంటారు. అయితే కారులో తిరగాలని అనుకునేవారు ఇప్పుడు తక్కువ బడ్జెట్ లోనే వెహికల్ ను కొనవచ్చు. అంతేకాకుండా కొన్ని రోజులపాటు హాయిగా వ్యవహరించవచ్చు. కొత్తగా కారు కొనుగోలు చేయాలంటే ఈ రోజుల్లో కనీసం రూ.5 నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే లోన్ ద్వారా తీసుకుంటే వడ్డీ భారం తడిసి మోపడుతుంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరలోనే కారును కొనగలిగే అవకాశం ఉంది. అదెలా అంటే?
కొత్త కారు కొనడానికి చాలామంది ముందుకు రారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ లోని కొందరు పీపుల్స్ కారులో తిరగాలని ఆశ ఉంటుంది. కానీ అనువైన బడ్జెట్ ఉండదు. అయితే ఇలాంటి సమయంలోనే యూస్డ్ కారును కొనుగోలు చేసి తమ కోరికను తీర్చుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అంటే కొత్త కారు కంటే సెకండ్ హ్యాండ్ కార్లు చాలా తక్కువ ధరకు అందుబాటులోకి ఉంటాయి. అంతేకాకుండా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా కారులో వివరించవచ్చు.
సాధారణంగా కొత్త కారు అయితే రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ యూజుడ్ కారు అయితే రూ. 2 లక్షల వరకు పొందవచ్చు. అయితే ఇటీవల కొన్ని కంపెనీలు సెకండ్ హ్యాండ్ కార్లను కూడా విక్రయిస్తున్నాయి. వీటిలో మారుతికి చెందిన వ్యాగన్ఆర్ కారు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ ను కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కారులో ఇంజన్ పనితీరుతో పాటు.. ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసిన వ్యాగన్ఆర్ ను.. కొన్ని రోజులపాటు వాడిన తర్వాత మరో కారును కొనుగోలు చేయాలని అనుకుంటే.. దీనిని సెకండ్ హ్యాండ్ కింద విక్రయిస్తుంటారు. ఇలాంటి కార్లను స్పిన్ని, కార్ దేకో, మారుతి సుజుకి ట్రూ వేల్యూ అనే సంస్థలు విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ వ్యాగన్ఆర్ కారును రూ. 2 లక్షలకే విక్రయిస్తున్నారు. లో బడ్జెట్లో కారు కొనాలని అనుకునేవారు ఈ సంస్థలను సంప్రదించవచ్చు.
Also Read: ఈ సంవత్సరంలో వచ్చే సూపర్ అప్ కమింగ్ కార్లు..
అయితే కొత్తగా కారు కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను బాగా పరిశీలించుకోవాలి. ముందుగా ఈ కారును నిపుణులైన మెకానిక్ చేత తనిఖీలు చేయించాలి. కారు గతంలో ఏదైనా ప్రమాదానికి గురైందా? దీనిపై ఏమైనా బ్యాంకు లోన్స్ ఉన్నాయా? అనే విషయాలను ముందే తెలుసుకోవాలి. ఎందుకంటే కారు కొనుగోలు చేసిన తర్వాత ఇలాంటి విషయాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసే ముందు దానిపై ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు ఉంది అనే విషయాన్ని కూడా గ్రహించాలి.
అన్ని బాగున్న తర్వాత కారును కొనుగోలు చేసుకోవచ్చు. అయితే సాధారణ విక్రయ సంస్థలు కాకుండా బ్రాండెడ్ సంబంధించిన షో రూమ్ లో యూస్డ్ కారును కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనాలు ఉండనున్నాయి. ఎందుకంటే కొన్ని సంస్థలు యూజుడ్ కార్లకు కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉంది.