Homeబిజినెస్Vivo new smartphones X500 series: Vivo నుంచి మరో మూడు కొత్త మొబైల్స్.. ఇవి...

Vivo new smartphones X500 series: Vivo నుంచి మరో మూడు కొత్త మొబైల్స్.. ఇవి ఎలా ఉన్నాయంటే..

Vivo new smartphones X500 series: మొబైల్ యూజర్లను ఆకట్టుకునేందుకు మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కంపెనీలకు చెందిన ఫోన్లు మాత్రమే ఎక్కువగా ఆదరణ పొందుతాయి. వాటిలో Vivo కంపెనీ మొబైల్స్ ఎక్కువగా యూత్ తో పాటు రోజువారి వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీరి ఇష్టాన్ని గ్రహించిన ఈ కంపెనీ వారికి అనుగుణంగా కొత్త కొత్త డివైస్ లను ప్రవేశ పెడుతూ ఉంటుంది. ఇందులో భాగంగా ఇటీవల VIVO X300 సిరీస్ మొబైల్స్ ను ప్రవేశపెట్టింది. అయితే వీటికి కొనసాగింపుగా ఇప్పుడు వివో x 500 సిరీస్ కూడా రాబోతుంది. వివో ఎక్స్ 500, వివో ఎక్స్ 500 ప్రో, వివో ఎక్స్ 500 ప్రో మాక్స్ అనే మూడు ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. అయితే ఇప్పటివరకు వచ్చిన ఫోన్లో కంటే ఇందులో ఉండే స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

వివో కంపెనీకి చెందిన ఎక్స్ 500 సిరీస్ లో భాగంగా.. మొదటి మొబైల్ డిస్ప్లే 6.37 అంగుళాల LTPO డిస్ప్లే ఉండనుంది. ఇది 1.5 K Resolution తో పనిచేస్తుంది. అలాగే వివో ఎక్స్ 500 ప్రో మోడల్ లో 6.85 అంగుళాల ప్లాట్ ప్యానెల్ ఉండనుంది. మూడో మొబైల్ వివో ఎక్స్ 500 ప్రో మాక్స్ మొబైల్ 6.59 అంగుళాల LTPS స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ మూడు మొబైల్స్ 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తాయి. అలాగే ఇందులో 3d అల్ట్రాసోనిక్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ కూడా ఉన్నాయి.

వివో ఎక్స్ 500 మూడు సిరీస్లో వస్తున్నప్పటికీ ఇందులో కెమెరా పనితీరు సమానంగా ఉండే విధంగా సెట్ చేశారు. ఈ మూడు మొబైల్స్ లో 200 మెగాపిక్సల్ తో మెయిన్ కెమెరా ఉండనుంది. ఇందులోనే పెరిస్కోప్ టెలిఫోటో, అప్గ్రేడ్ చేసిన ఆల్ట్రా వైడ్ సెన్సార్ కూడా ఉండనుంది. దీంతో సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారితో పాటు ఏఐ తరహాలో ఫోటోలు తీసుకునే వారికి ఈ కెమెరా బాగా ఉపయోగపడుతుంది.

అలాగే బ్యాటరీ వ్యవస్థ కూడా ఈ మూడు మొబైల్స్ లో ఒకే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిలో 7000 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్టు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ మూడింటి ఫోన్లోనూ మీడియా టెక్ డైమెన్సిటీ 9600 గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇవి మార్కెట్లోకి వస్తే ధర కూడా బడ్జెట్లోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular