Vivo X Fold 6: Vivo కంపెనీకి చెందిన కొత్త ఫోన్ ఇటీవల చైనాలో లాంచ్ చేయబడింది. ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లోకి వచ్చింది. ప్రీమియం లుక్ తో పాటు ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఫోన్ కావాలని అనుకునేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె…
Also Read: వెంకటేష్ ఆ జానర్ ను టచ్ చేస్తే బాగుంటుందిగా…
చైనాలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో వివో కంపెనీకి చెందిన కొత్త ఫోన్ Vivo X Fold 6 ను లాంచ్ చేశారు. ఇది ఈ కంపెనీ నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తుంది. రౌండెడ్ కార్నర్లు, ప్రీమియం లుక్‌తో చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫోన్ ‘బ్లూ హోల్’, ‘పోలార్ నైట్’, ‘సాల్ట్ లేక్’ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.
ఈ ఫోన్‌లో అత్యుత్తమమైన డిస్‌ప్లేను అందించారు. ఇందులో 8.02 అంగుళాల ఫోల్డబుల్ శామ్‌సంగ్ M14 AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. బయట వైపు 6.51 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంది. ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీంతో పాటు మల్టీ టాస్కింగ్ కోసం ‘ఆరిజిన్ OS 6 ఫోల్డ్’ సాఫ్ట్‌వేర్ కూడా ఉంది.
ఈ ఫోన్‌లోని అతి ముఖ్యమైన ఫీచర్ బ్యాటరీ. ఫోల్డబుల్ ఫోన్లలోనే అత్యధికంగా 7,000mAh బ్యాటరీని కంపెనీ ఇందులో అందించింది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే.. దీని వెనుక వైపు 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో లెన్స్‌లతో కూడిన పవర్డ్ కెమెరా సెటప్ ఉంది.
ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో మాత్రమే లాంచ్ చేయబడింది. దీని ప్రారంభ ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు సుమారు 7,999 యువాన్లుగా (సుమారు రూ. 1,11,000) ఉంది. టాప్ వేరియంట్ 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు 10,999 యువాన్ల వరకు ఉంది. ఈ ఫోన్ జూలై 1 నుండి చైనాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది.
