Vijay Sankeshwar
Vijay Sankeshwar: జీవితమంటే పూల పాన్పు కాదు.. ముళ్ల కంచె.. ఈ డైలాగ్ ఏన్నో సినిమాల్లో వింటూంటాం..కానీ రియల్ గా చాలా మంది దీనిని అనుభవించే ఉంటారు. సక్సెస్ ఫుల్ జీవితం పొందాలంటే.. దాని వెనుక ఎన్నో ముళ్ల కంపలు ఉంటాయి. వాటన్నింటిని ఛేదించుకొని ముందుకు వెళ్తేనే అందమైన జీవితం ఉంటుంది. అలా ముందుకు వెళ్లిన వారే విజేతలవుతారు. ఇప్పుడున్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలంతా ఒకప్పుడు చిన్న కిరాణ కొట్టును నడిపిన వారే. వారంతో ఎన్నో ఒడిదొడుకులు దాటుకొని విజయం సాధించారు. అలా ఒక్క ట్రక్కుతో వ్యాపారం ప్రారంభించిన ఓ వ్యక్తి ఈరోజు కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అయితే ఆయన ఇంతటి స్టేజీకి ఎదగడానికి ఇబ్బందులు పడక తప్పలేదు.. అంతేకాకుండా తండ్రి ఇష్టానికి విరుద్దంగా వెళ్లి జగజ్జేతగా నిలిచారు. మరి ఆయన గురించి తెలుసుకుందామా..
కర్ణాటక రాష్ట్రంలో VRL సంస్థ గురించి చెబితే ఇప్పుడు ఎవరైనా చెబుతారు. రూ.6000 కోట్ల కంటె ఎక్కువ మార్కెట్ కలిగిన లిస్టెడ్ కంపెనీ అయిన ఈ కంపెనీ 150కి పైగా ట్రక్కులు నడుపుతోంది. వీటితో పాటు ట్రావెల్ బస్సులు కూడా నడపడంతో ఇది లాజిస్టిక్స్ లిమిటెడ్ కంపెనీగా ప్రసిద్ది చెందింది. ఈ సంస్థకు అనుబంధంగా వింగ్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఎయిర్ చార్టర్ సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇంతటి సామ్రాజ్యం ఏర్పడడానికి కృషి చేసిన వ్యక్తే విజయ్ సంకేశ్వర్.
విజయ్ సంకేశ్వర్ ది కర్ణాటకలోని ధర్వాడ. అతిపెద్ద వాణిజ్య వాహనాలకు యజమాని అయిన ఈయన 1970లో ఒకే ఒక్క ట్రక్కు తో వ్యాపారం చేయాలని అనుకున్నాడు. అయితే విజయ్ కుటుంబం ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారం నిర్వహిస్తుంటుంది. కానీ అతను తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్దంగా ట్రక్కుల వ్యాపారం వైపు మొగ్గు చూపాడు. ఈ తరుణంలో 1976లో అప్పుగా తీసుకున్న కొంతమొత్తంతో ఒక ట్రక్కును కొనుగోలు చేశాడు.
ట్రక్కును కొనుగోలు చేసిన ప్రారంభంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. మరో వైపు చేసిన అప్పు తీర్చలేక తీవ్రంగా మనస్థానం చెందాడు. కానీ పట్టుదలతో అలా ముందడుకు వేసిన ఆయన 1994లో VRL పేరుతో కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ ప్రారంభించిన తరువాత విజయ్ సంకేశ్వర్ కు అదృష్టం తోడైంది. దీంతో 150 వరకు ట్రక్కులను కొనుగోలు చేశాడు. అలా ఈ కంపెనీ లాజిస్టిక్ లిమిటెడ్ గా ప్రసిద్ధి చెందింది.
విజయ్ సక్సెస్ ను అంతటితో ఆపలేదు. తన కుమారులను కూడా ఇదే రంగంలోకి దించాడు. అయితే కుమారుడు ఆనంద్ సంకేశ్వర్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఎయిర్ చార్టర్ సర్వీస్ వంటివాటిని బాధ్యత తీసుకున్నాడు. ప్రస్తుతం కంపెనీ మొత్తం రూ.6000 కోట్లకు పైగా మార్కెట్ ను కలిగి ఉంది. విజయ్ సంకేశ్వర్ జీవితం సక్సెస్ ఆధారంగా ‘విజయానంద్’ అనే మూవీ కూడా వచ్చింది.