
Vandebharat Train : అత్యాధునిక హంగులు, విమానాల్లో ప్రయాణించే విధంగా అనుభూతి కలిగించే సౌకర్యాలు కలిగిన ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ రైలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ఇచ్చింది. జెట్ స్పీడ్ తో వెళ్తున్న ఈ రైలులో ప్రయాణించేందుకు కాస్త ఖర్చు ఎక్కువైనా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైలు తిరగబోతుంది. సికింద్రాబాద్ -తిరుపతి మధ్య ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ను నడపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిని ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం రానున్నారు. ఇప్పటికే ఈయన పర్యటనకు అన్నీ ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తుతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
సికింద్రాబాద్ టు తిరుపతి మధ్య నడిచే ఈ రైలు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుతుంది. తిరిగి తిరుపతిలో 3.15 గంటలకు స్ట్రాట్ అయ్యి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మార్గమధ్యలో నల్లొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం మినహా ఈ రైలు అన్ని రోజుల్లో ప్రయాణిస్తుంది. అయితే తిరుపతికి వెళ్లాలనుకునేవారికి ఐర్ సీటీసీ తన వెబ్ సైట్లో ధరల వివరాలను అందుబాటులో ఉంచింది. వాటి వివరాల ప్రకారం..
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాలనుకునేవారికి ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1680, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ రూ.3080 గా నిర్ణయించారు. అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ప్రయాణించేవారికి ఏసీ చైర్ కార్ టికెట్ ధర 1625, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ రూ.3030 గా పేర్కొన్నారు. అయితే రెండు ప్రాంతాల మధ్య దూరం సమానమే అయినప్పటికి ధరల్లో వ్యత్యాసాలున్నాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వారికంటే.. తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు వచ్చే వారికి రెండు కేటగిరీల్లోనూ దాదాపు రూ.50 తేడా ఉన్నాయి.

వాస్తవానికి అసలు టికెట్ ధర తక్కువే. కానీ జీఎస్టీ, సూపర్ ఫాస్ట్, ఆహార పదార్థాలన్నింటికి కలిపి ఫిక్స్ చేశారు. అయితే ఫుడ్ వద్దనుకేనేవారికి ఈ టికెట్ లో కొంచెం తగ్గుదల ఉంటుంది. ఉదాహరణకు ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1680ని చూస్తే.. ఈ కేటగిరి టికెట్ బేస్ ధర రూ.1168, రిజర్వేషన్ చార్జి రూ.40, సూపర్ ఫాస్ట్ చార్జి రూ.45, మొత్తం జీఎస్టీ రూ.63. వీటితో పాటు ఆహారానికి రూ.364గా నిర్ణయించారు. ఇలా అన్నింటికి కలిపి టికెట్ ధర కేటాయించారు. ఇందులో ఫుడ్ వద్దనుకుంటే రూ.364 లెస్ అవుతుంది. ఇక తిరుపతి నుంచి టికెట్ బేస్ ధర రూ.1169, కేటరింగ్ చార్జి మాత్రం రూ.308గా నిర్ణయించారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కాకుండా ఇతర స్టేషన్లకు వెళ్లాలనుకుంటే.. ఏసీ చైర్ కార్ సికింద్రాబాద్ నుంచి నల్గొండ రూ.470, గుంటూరు వరకు రూ.865, ఒంగోలు వరకు రూ.1075, నెల్లూరు వరకు రూ.1270, తిరుపతి వరకు రూ.1680 గా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ చార్జీలు పరిశీలిస్తే సికింద్రా బాద్ నుంచి నల్గొండ వరకు రూ.900, గుంటూరు వరకు రూ.1620, ఒంగోలు వరకు రూ.2045, నెల్లూరు వరకు రూ.2455, తిరుపతి వరకు రూ.3080 గా నిర్ణయించారు.