Ratan Tata Love Story : ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు జంషెడ్ జీ టాటా ముని మనుమడు రతన్ టాటా. 1937లో జన్మించిన ఆయన 1948లో తన పదహారేళ్ల వయసులో ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దీంతో రతన్ టాటా తన నానమ్మ నవాజ్ బాయి టాటా వద్ద పెరిగారు. 1955లో న్యూయార్క్‌లోని రవర్ డేట్ కంట్రీ స్కూల్‌లో డిప్లొమా చేశారు. 1961లో టాటా గ్రూప్‌లో అసిస్టెంట్‌గా కేరీర్ ప్రారంభించారు. తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్ నుంచి డిగ్రీ చేశారు. 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ను ప్రారంభించారు.
అంచలంచెలుగా ఎదిగి..
టాటా గ్రూప్ సంస్థల వ్యాపారిభివృద్ధిలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారు. తాను అంచలంచెలుగా ఎదగడమే కాకుండా వ్యాపారి సామ్రాజ్యాన్ని విస్తరించారు. రెండేళ్ల క్రితం ఎయిర్ ఇండియాను టేకోవర్ చేశారు. టాటా ఎయిర్ పేరుతో ఇటీవలే సర్వీస్‌లు ప్రారంభించారు. సామాన్యుడికి కారు అందుబాటులోకి తేవాలని రూ.లక్ష కే కారు తయారు చేశారు. అయితే అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా రతన్ టాటా అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. 2014లో ఐఐటీ బాంబేకు వచ్చిన ఆయన 95 కోట్లు విరాళం ప్రకటించారు. ఇక కరోనా సమయంలో అయితే రూ.1,500 కోట్ల భారీ విరాళం అందించారు.
ఆజన్మ బ్రహ్మచారి..
ఇక రతన్ టాటా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. దీని వెనుక ఓ విఫల ప్రేమ కథ ఉంది. రతన్ టాటా అమెరికాలో ఉన్న సమయంలో ఓ యువతితో పేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలోనే రతన్ టాటా నానమ్మ ఆరోగ్య సమస్యల కారణంగా భారత్‌కు వచ్చారు. అదే సమయంలో భారత్–చైనా యుద్దం జరుగుతోంది. దీంతో టాటా ప్రేమించిన యువతి భారత్‌కు రావడానికి అనుమతించలేదు. దీంతో వారి ప్రేమ కథ పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఓ ఇంటర్వ్యూలో రతన్ టాటా తనకు భార్య, పిల్లలు లేకపోవడం కారణంగా కొన్నిసార్లు ఒంటరిగా అనిపిస్తుందని పేర్కొన్నారు. చాలా మంది అమ్మాయితో ప్రేమలో పడ్డానని, కానీ పని బిజీలో పెళ్లి వరకు వెళ్లలేదని తెలిపారు. తనకు పెళ్లి కాకపోవడానికి సమయం దొరకకపోవడం కూడా ఒక కారణం అని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల విడాకుల ప్రభావం..
ఇక రతన్ టాటా 16 ఏళ్ల వయసులో ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దీంతో రతన్ తన నానామ్మ దగ్గర పెరిగారు. తల్లిదండ్రుల విడాకులతో రతన్ టాటా ఇబ్బంది పడ్డారు. ఆరోజుల్లో విడాకులు సహజం కాదు. టాటా తల్లి విడాకుల తర్వాత మరో పెళ్లి చేసుకోవడం.. ఇది తెలిసి టాటాను ఆయన స్నేహితులు ఏడిపించడం కూడా టాటా పెళ్లి చేసుకోకపోవడానికి ఓ కారణంగా చెబుతారు.