TVS : మనదేశపు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ తన ఐక్యూబ్‌తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ స్కూటర్ అతి తక్కువ కాలంలోనే ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఏకంగా ఓలా ఎలక్ట్రిక్‌ను వెనక్కి నెట్టి, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ విజయాన్ని కొనసాగించేందుకు టీవీఎస్ ఇప్పుడు రాబోయే పండుగల సీజన్ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. పండుగల సీజన్ లక్ష్యంగా చేసుకుని దాని పాపులర్ మోడల్ ఐక్యూబ్ సరికొత్త వేరియంట్‌ను రిలజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.ప్రస్తుతం కంపెనీ ఐక్యూబ్‌ను ఐదు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందిస్తోంది.
Also Read : ఇండియా బైక్స్‌కు విదేశాల్లో విపరీతమైన క్రేజ్.. సత్తా చాటిన రాయల్ ఎన్ ఫీల్డ్
కొత్తగా రాబోయే ఐక్యూబ్ వేరియంట్ ధర, ఫీచర్ల విషయంలో మరింత ఎట్రాక్టివ్ గా ఉండవచ్చని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం టీవీఎస్ ప్రదర్శించిన నార్తర్న్ లైట్స్-ఇన్ స్పైర్ కాన్సెప్ట్ ఈ కొత్త వేరియంట్‌కు బేస్ డ్ గా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐక్యూబ్ ప్రారంభ ధర రూ.1.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి టాప్ వేరియంట్‌కు రూ.1.60 లక్షల వరకు ఉంది.
2025 సిరిస్ లో రాబోయే ఐక్యూబ్ ST 2025 కాన్సెప్ట్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ముదురు నీలం రంగు, తెలుపు రంగు డీకల్స్‌తో ఇది స్పెషల్ గా కనిపిస్తోంది. ఇంజిన్, బ్యాటరీ ప్యాక్, ఫీచర్ల జాబితాలో కొన్ని అప్‌గ్రేడ్‌లు ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, టీవీఎస్ ఈ వివరాలను ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోలో వెల్లడించలేదు. గత కొద్ది నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో టీవీఎస్ తన పట్టును క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. కొత్త వేరియంట్ విడుదలైన తర్వాత ఈ వాటా మరింత పెరిగే అవకాశం ఉంది.
ఏప్రిల్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు
టీవీఎస్ ఐక్యూబ్ గత నెల అంటే ఏప్రిల్‌లో ఏకంగా 19,736 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం అంటే ఏప్రిల్ 2024లో నమోదైన 7,762 యూనిట్ల కంటే దాదాపు 154శాతం వృద్ధిని సూచిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ కలిసి ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కలిసి ఇప్పటివరకు 10 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించాయి. జనవరి 2020లో విడుదలైన ఈ రెండు స్కూటర్లు స్వల్ప కాలంలోనే ఈ ఘనత సాధించడం విశేషం.
Also Read : పాత యాక్టివాను ఎలక్ట్రిక్‌గా మార్చడం లాభమా? నష్టమా?