spot_img
Homeబిజినెస్TVS Jupiter sales March 2026: 2026 మార్చి నెలలో పుంజుకున్న TVS Jupiter..మిగతా వాటి...

TVS Jupiter sales March 2026: 2026 మార్చి నెలలో పుంజుకున్న TVS Jupiter..మిగతా వాటి సేల్స్ ఎలా ఉన్నాయంటే..

TVS Jupiter sales March 2026: భారతదేశంలో అత్యధిక టూవీలర్స్ విక్రయాల కంపెనీలో TVS ఒకటి. ఈ కంపెనీకి చెందిన ఎన్నో వాహనాలు వినియోగదారులను అలరించేందుకు మార్కెట్లోకి వచ్చాయి. నేటితరం వారిని ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ పరిచయం అవుతున్నాయి. అయితే 2026 మార్చి నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ తన ద్విచక్ర వాహనాల విభాగంలో అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసింది. పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో అత్యధిక సేల్స్ నమోదు చేసుకుంది. ఈ కంపెనీకి చెందిన ప్రజాదరణ పొందిన స్కూటర్ గా ‘టీవీఎస్ జూపిటర్’ (TVS Jupiter)నిలిచింది. అలాగే మిగతా టూ వీలర్స్ ఏ విధంగా సేల్స్ చేసుకున్నాయో చూద్దాం..

2026 మార్చి నెలలో TVS మోటార్ కంపెనీ మొత్తం 3,72,771 యూనిట్ల అమ్మకాలు చేసుకుంది. 2025 ఇదే నెలలో ఈ కంపెనీ 2,97,590 వెహికిల్స్ ను విక్రయించింది. గత ఏడాదితో పోలీస్తే ఈ కంపెనీ 25.13 శాతం అమ్మకాల వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది. అయితే 2026 మార్చి నెలలో టీవీఎస్ కంపెనీకి చెందిన జూపిటర్ స్కూటర్ 1,24,771 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెల (మార్చి 2025)తో పోలిస్తే, ఈ అమ్మకాలలో 17.89 శాతం వృద్ధి నమోదవ్వడం విశేషం. మార్చి 2025లో జూపిటర్ స్కూటర్లు 1,05,834 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

జూపిటర్ తర్వాత టీవీఎస్ సంస్థకు చెందిన ‘అపాచీ’ (TVS Apache) మోటార్ సైకిల్ రెండవ స్థానంలో నిలిచింది. అపాచీ మోటార్ సైకిల్స్ మార్చి 2026లో మొత్తం 47,081 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. గత ఏడాదితో పోల్చినప్పుడు, ఈ విభాగంలో 6 శాతం వార్షిక వృద్ధి నమోదైనట్లు కంపెనీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ కంపెనీకి చెందిన XL 46,192 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ నెలలో ఈ మోడల్ 35,181 అమ్మకాలు నమోదు చేసింది. ఏడాదిలో ఈ మోడల్ 31.30 శాతం వృద్ధి సాధించింది. 4వ స్థానంలో EV అయిన iQube 38,757అమ్మకాలతో నిలిచింది. గత ఏడాది ఈ నెలలో ఈ స్కూటర్ 26,499 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. ఈ స్కూటర్ ఏడాదిలో 46.26 శాతం వృద్ధిని సాధించింది. టాప్ 5 లో Raider నిలిచింది. ఈ బైక్ 37,345 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. గత ఏడాదిలో దీనిని 30,988 కొనుగోలు చేశారు. ఏడాదిలో ఈ బైక్ 20.51 శాతం వృద్ధిని సాధించింది.

టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు సమానంగా సేల్స్ ను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఐక్యూబ్, జూపిటర్, రైడర్ మోడళ్లు స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నాయి. అయితే రాబోయే నెలల్లో మిగతా స్కూటర్ల అమ్మకాలను ప్రోత్సహించడానికి సిద్ధమవుతోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version