Homeబిజినెస్Toyota Innova Hycross New Model: SUV లవర్స్ ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్న టయోటా...

Toyota Innova Hycross New Model: SUV లవర్స్ ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్న టయోటా కొత్త కారు..

Toyota Innova Hycross New Model: నిగనిగా లాడుతున్న ఈ కారును చూస్తే కచ్చితంగా కొనాలని అనిపిస్తుంది. అయితే సాధారణంగా దీన్ని చూడగానే సెడాన్ కారు అని అనుకుంటారు. కానీ ఇది SUV వేరియంట్ లోని ఫేస్ లిఫ్ట్ కారు. ఇది Innova కంపెనీ నుంచి రాబోతుంది. ఇప్పటికే దీని గురించి ప్రకటన రాగా.. త్వరలోనే ఇది మార్కెట్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. Toyota కంపెనీకి చెందిన Innova ఐ క్రాస్ కారు 2022లో మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఇది అప్డేట్ అయి రాబోతుంది. ఇందులో కొన్ని మార్పులు చేయడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఈ కారులో ఎటువంటి మార్పులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Toyota కంపెనీకి చెందిన ఇన్నోవా ఐ క్రాస్ ఎక్స్టీరియర్ డిజైన్ లో కొన్ని మార్పులు చేశారు. ఇది విశాలంగా ఉండబోతుంది. గతంలో ఉన్న కారు కంటే ఇందులో ఎక్కువగా లగేజ్ ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు వరసల సీట్లు ఉండే లెగ్ రూమ్ చాలా పెద్దదిగా ఉంటుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా దూర ప్రయాణాలు చేసినప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే కస్టమర్ బేస్ వారి అవసరాలను తీరుస్తూ ఉంటుంది. చాలామంది SUV కార్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటివారు దీనిని ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే 360 డిగ్రీ కెమెరా, ADAS, వైర్లెస్ ఆపిల్ కార్బ్లే, ఆండ్రాయిడ్ ఆటో, JBL ఆడియో సిస్టం, ఎయిర్ ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా అప్డేట్ చేశారు. ఈ కొత్త కారులో పెట్రోల్ మాత్రమే కాకుండా CNG వేరే అంటే కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్ 2.0 లీటర్ తో పనిచేయగా ఇది 23 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పనిచేస్తుంది. అలాగే CNG ఆప్షన్ కూడా దీనికి తోడవడంతో మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే ప్రత్యర్థులకు దడ పుట్టించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారన్స్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు SUV కార్లు అయినా మహేంద్ర స్కార్పియో కు కూడా పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే రూ.38 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. 2026 చివరి అర్థ భాగంలో లేదా 2027 ప్రారంభంలో గానీ దీనిని ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular