Homeబిజినెస్Toyota : ఎలక్ట్రిక్ కార్లు కాదు.. హైబ్రిడ్ కార్లతోనే రికార్డులు సృష్టిస్తున్న కార్ల కంపెనీ

Toyota : ఎలక్ట్రిక్ కార్లు కాదు.. హైబ్రిడ్ కార్లతోనే రికార్డులు సృష్టిస్తున్న కార్ల కంపెనీ

Toyota : టయోటా కంపెనీ ఇండియన్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడం లేదు. కానీ దాని ఫోకస్ ఎప్పుడూ హైబ్రిడ్ కార్లపైనే ఉంటుంది. ఏప్రిల్ 2025లో దేశంలో మొత్తం 8,754 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు అమ్ముడయ్యాయి. అందులో టయోటా ఒక్కటే 7,007 యూనిట్లను అమ్మడం విశేషం. అంటే ప్రతి 10 హైబ్రిడ్ కార్లలో 8 టయోటా అమ్మినవే. టయోటా దేశంలో ఇన్నోవా హైక్రాస్, హైరైడర్, వెల్‌ఫైర్, కామ్‌రీ కార్లను అమ్ముతోంది. వీటిలో హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది.

Also Read : టయోటా సంచలనం.. డీజిల్ లేకుండానే దూసుకుపోతుంది

ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఇండియా, హోండా కార్స్ కూడా ఉన్నాయి. మారుతి సుజుకి ఇండియా ఏప్రిల్ 2025లో 1,657 హైబ్రిడ్ కార్లను అమ్మగా, అందులో గ్రాండ్ విటారా, ఇన్విక్టో మోడళ్లు ఉన్నాయి. ఇక హోండా కార్స్ ఇండియా కేవలం 90 హోండా సిటీ హైబ్రిడ్ కార్లను మాత్రమే అమ్మగలిగింది.

పెరుగుతున్న హైబ్రిడ్ కార్ల డిమాండ్
ఇటీవల చాలా రాష్ట్రాలు హైబ్రిడ్ కార్లపై భారీ సబ్సిడీలను ఇవ్వడం మొదలుపెట్టాయి. ఉత్తరప్రదేశ్ ఈ విషయంలో ముందుంది. దీనివల్ల దేశంలో హైబ్రిడ్ కార్ల డిమాండ్, అమ్మకాలు పెరుగుతున్నాయి. టయోటా, మారుతి, హోండా కలిపి దేశంలో దాదాపు 7 కార్లు హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులో ఉన్నాయి.

హైబ్రిడ్ కార్ల అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, పెట్రోల్-డీజిల్ కార్లతో పోలిస్తే ఇవి చాలా మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీని ఇస్తాయి. అంతేకాదు వీటి కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ హైబ్రిడ్ మోడల్‌ను చూస్తే, ఇది లీటర్‌కు 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సాధారణంగా ఇంత మైలేజీ చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో వస్తుంది. కాబట్టి ఒక మిడ్-సైజ్ ఎస్‌యూవీకి ఇది చాలా మంచి మైలేజీ అని చెప్పొచ్చు.

Also Read : Toyota నుంచి ప్రత్యేక ఎడిషన్.. ధర, ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version