Top Selling Cars In 2025: కేంద్రం ఇటీవల జీఎస్టీని తగ్గించింది. దీంతో కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో గడిచిన రెండు నెలల్లో కార్ల కొనుగోళ్లు పెరిగాయి. ఇక 2025 లో కార్ల మార్కెట్ పెరిగింది. కేంద్రం చిన్న కార్లపై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. సెస్ పూర్తిగా రద్దు చేసింది. దీంతో చాలా మంది వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. పండుగ సీజన్ ఆఫర్లు, ఇయర్–ఎండ్ డిస్కౌంట్లతో మధ్యతరగతి కస్టమర్లు కార్ల వైపు మళ్లారు. సంపాదన పెరగడం, సౌకర్యాలు పెరగడంతో ఇంటికి కారు అవసరం సాధారణమైంది. కొన్ని కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మధ్య తగతి వారు కూడా కార్ల కోసం ఎగబడ్డారు.
అగ్రస్థానంలో డిజైర్..
2025 జనవరి–నవంబర్‌లో మారుతీ సుజుకీ డిజైర్ 1,95,416 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఎస్‌యూవీలు 55% మార్కెట్ షేర్ కలిగి ఉన్నప్పటికీ, టాప్–10లో ఏకైక సెడాన్ డిజైర్ మాత్రమే. 41 ఏళ్లలో రెండోసారి సెడాన్ టాప్ ప్లేస్ సాధించడం ఆసక్తికరం. మధ్య తరగతి వారికి డిజైర్ నమ్మకమైన మైలేజ్ ఇస్తుంది. అందుకే చాలా మంది దీనిని కొంటున్నారు.
టాప్–10 లిస్ట్ మారుతీ ఆధిపత్యం
2025లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మారుతీ సుజుకీకి చెందిన ఆరు మోడల్స్ ఉన్నాయి. దీంతో మారుతీ ఆధిపత్యం చెలాయించింది. హ్యుందాయ్ క్రెటా (1,87,968 యూనిట్లు) రెండో, టాటా నెక్సాన్ (1,81,186) మూడో స్థానాల్లో ఉన్నాయి. వ్యాగన్ ఆర్, ఎర్టిగా, స్విఫ్ట్, బ్రెజ్జా, ఫ్రాంక్స్ కూడా మారుతీకి చెందినవే. ఇక మహీంద్రా స్కార్పియో (1,61,103), టాటా పంచ్ (1,57,522) కూడా జాబితాలో ఉన్నాయి.
ఎస్‌యూవీలు వర్సెస్ సెడాన్..
ఎస్‌యూవీలు మార్కెట్‌ను ఆధీనం చేస్తున్నా, డిజైర్ వంటి సెడాన్‌లు మైలేజ్, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటంతో మధ్యతరగతిని ఆకర్షిస్తున్నాయి. టాప్–10లో 6 ఎస్‌యూవీలు, 2 హ్యాచ్‌బ్యాక్‌లు, ఒక ఎంపీవీ ఉన్నా సెడాన్ టాప్ స్థానం సాధారణ ధరలు, జీఎస్టీ ప్రయోజనాలు కీలకం.
ఇక ఇప్పుడు ఇయర్–ఎండ్ ఆఫర్లు నడుస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి వస్తున్నాయి. దీంతో ఈ నెలాఖరులో కొనుగోళ్లు గణనీయంగా జరిగే అవకాశం ఉంది. కొత్త మోడళ్ల రాకతో 2026లో మరింత పోటీ తీవ్రమవుతుంది. కస్టమర్లు మైలేజ్, ఫీచర్లు, రీసేల్ వాల్యూ పరిగణనలో డిజైర్ వంటి మోడల్స్ ఎంపిక చేస్తున్నారు. మారుతీ ఆధిపత్యం కొనసాగుతుందని నిపుణులు అంచనా.