RBI: ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలైతే ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంకు కల్లె వేయడానికి ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. వృద్ధికి, ద్రవ్యోల్బణానికి మధ్య సమతులయ్యం కుదరడం లేదు. దీంతో జీఈపీ అంచనాలకన్నా తక్కువగా 5.4 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం 6 శాతానికిపైగా నమోదవుతోంది. ఈ సమయంలో వడ్డీ రేట్లు తగ్గిండానికి ఆర్‌బీఐ వెనుకాడింది. టమాటా, ఆలుగడ్డల ధరలు వడ్డీ రేట్ల కత ఆశలపై నీళ్లు చల్లాయి. 2023 నవంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో వీటి ధరలు 35 శాతం, 50 శాతం పెరిగాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం గరిష్టంగా 14 నెలల గరిష్టానికి చేరింది. దీంతో ఆర్‌బీఐ తాజాగా రెపోరేటు సవరించలేదు. యథాథథంగా 6.5 శాతం వద్దనే ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తెలిపారు. మార్పు లేకుండా చేయడం ఇది 11వ సారి.
ప్రభావం చూపిన అంశాలు ఇవీ..
ద్రవ్యోల్బణ ఒత్తిడి, జూలై–సెప్టెంబర్‌లో జీడీపీ వృద్ధి ఏడు త్రైమాసికాల కనిష్టం 5.4 శాతానికి పరిమితం కావడం. రూపాయి విలువ పడిపోయి 84 దాటడం కూడా వడ్డీ రేట్ల కోటకు ఆటంకంగా మారాయి. దీంతో రెపోరేటు సవరించేందుకు ఎంపీఎస్‌లో ఆరుగురు సభ్యుల్లో నలుగురు నిరాకరించారు. బయటి సభ్యులు అయిన నగేశ్‌కుమార్, రామ్‌సింగ్ మాత్రం 0.25 శాతం కోతకు సిఫారసు చేశారు.
సీఆర్‌ఆర్ తగ్గింపు..
అయితే ఆర్‌బీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్‌ఆర్‌ను 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలోరి రూ.1.16 లక్షల కోట్లు అందుబాటులోకి వస్తాయి. డిపాజిట్ల కోసం ఒత్తిడి పెంచే బ్యాంకులకు ఇది కాస్త ఉపశమనం. ఇక విదేశీ కరెన్సీ డిపాజిట్లపై వడ్డీ రేటు పరిమితని పెంచడం ద్వారా మరిన్న మూల ధన నిధులు వస్తాయని ఆర్‌బీఐ అంచనా వేసింది.