https://oktelugu.com/

Gold Silver Prices : బంగారం కొనుగోలుదారులకు శుభవార్త..నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలతో పాటు వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,600గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2023 10:48 am
    Gold Prices

    Gold Prices

    Follow us on

    Gold Silver Prices : బంగారం సోమవారం స్థిరంగా కొనసాగాయి. గత వారం రోజుల పాటు వరుసగా పెరిగిన ధరలు ఆదివారం పెరుగుదల ఆగిపోయింది. వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగాయి. 2023 అక్టోబర్ 30న బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    బులియన్ మార్కెట్ ప్రకారం.. అక్టోబర్ 30న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,410గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,630 గా ఉంది. అక్టోబర్ 29న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,400తో విక్రయించారు. ఆదివారం కంటే సోమవారం బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,560 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,780గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,410 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,630 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,710 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,630తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,410 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,630తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,410తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,630తో విక్రయిస్తున్నారు.

    బంగారం ధరలతో పాటు వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,600గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,600గా ఉంది. ముంబైలో రూ.74,600, చెన్నైలో రూ.77,500, బెంగుళూరులో 73,250, హైదరాబాద్ లో రూ.77,500తో విక్రయిస్తున్నారు.