WhatsApp new features: మొబైల్ వాడే వారికి What’s app ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ మెసేజ్ తో పాటు ఫోటోలు, వీడియోలు పంపించేందుకు ఉపయోగించే వాట్సాప్ ను ఎప్పటికప్పుడు సేఫ్టీగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత సేఫ్టీ గా ఉన్నా కూడా ఒకసారి సైబర్ నేరగాళ్ల వలలో పడాల్సి వస్తుంది. అయితే లేటెస్ట్ గా వీరి నుంచి భద్రత కల్పించేందుకు వాట్సాప్ మాతృ సంస్థ Meta కొత్త ఫీచర్లను అందించనుంది. ముఖ్యంగా పిల్లలు, కుటుంబ సభ్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ‘ సెకండరీ అకౌంట్స్ కి అనే కీలక ఫీచర్ను అభివృద్ధి చేస్తోంది. అలాగే ఐఓఎస్ యూజర్లకు కొత్త హిస్టరీ షేరింగ్ ఆప్షన్, యూరప్- యూకే మార్కెట్లోకి యాడ్ ఫ్రీ సబ్క్క్రిప్షన్ ఫీచర్ను ప్రవేశపెట్టే యువతలో ఉంది. వాటి వివరాల్లోకి వెళితే
వాట్సాప్ లో కొత్తగా రానున్న ‘ సెకండరీ అకౌంట్స్ ‘ ఫీచర్స్ తో పిల్లలు, కుటుంబ సభ్యులు సేఫ్టీలో ఉండే అవకాశం ఉంది. ఈ ఫీచర్ తో కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ప్రధాన అకౌంట్ కు లింక్ అయి ఉంటుంది. కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్స్ లో స్టేటస్లు, ఛానల్ అప్డేట్స్ కనిపించవు. అంతేకాకుండా కాంటాక్ట్ లో లేని వ్యక్తులతో చాట్ చేసే అవకాశం ఉండదు. దీంతో అనవసరపు మెసేజ్ లు, తెలియని వారి నంబర్ల నుంచి ఇబ్బందులు ఉండవు. కేవలం పేరెంట్స్ అనుమతించే కాంటాక్ట్ నెంబర్లతో మాత్రమే మాట్లాడగలుగుతారు. దీంతో కుటుంబ సభ్యులను రక్షణలో ఉంచుకోవచ్చు.
iOS యూజర్లకు కొత్తగా వాట్సాప్ లో హిస్టరీ షేరింగ్ ఆప్షన్ రానుంది. ఇది ప్రత్యేక చాట్ హిస్టరీని కలిగి ఉంటుంది. గ్రూపులో ఉన్న సభ్యులు కొత్త మెంబర్స్ కు గరిష్టంగా 100 మెసేజ్లు ఒకేసారి షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్తగా చేరిన వాళ్ళ నేపథ్యాన్ని అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. ఈ షేరింగ్ మొత్తం యూజర్ నియంత్రణలోనే ఉంటుంది. అంటే ఎవరో ఒకరు మాత్రమే షేర్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది.
వీటితోపాటు యూరప్ దేశాల్లో కొత్తగా వాట్సాప్ యాడ్స్ ఫ్రీ సబ్క్క్రిప్షన్ ఫీచర్లు తీసుకురానున్నారు. వాట్సాప్ లో యాడ్స్ రాకుండా ఉండాలంటే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ప్రైవసీ కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఆ తర్వాత ఇది మిగతా దేశాల్లో కూడా ప్రవేశపెట్టి అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మూడు ఫీచర్ల ద్వారా వాట్సాప్ యూజర్లకు సేఫ్టీని ఇవ్వడంతో పాటు.. కొన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉండే అవకాశం ఉంది.